Beauty Tips

“చిగుళ్ల వాపు, పంటి నొప్పికి చెక్ పెట్టండి: ఆరోగ్యకరమైన దంతాల కోసం బెస్ట్ టిప్స్!”

Oral Health Tips :దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. దంతాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పెట్టిన అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే.

“దంతాలు బలంగా, తెల్లగా ఉండాలంటే కేవలం బ్రష్ చేస్తే సరిపోదు. మనం తినే ఆహారం, పాటించే అలవాట్లు కూడా ముఖ్యమే. దంతాల సమస్యల నుండి దూరంగా ఉండి, చిగుళ్లను దృఢంగా మార్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఉత్తమ మార్గాలు ఈ ఆర్టికల్‌లో చూడండి.”

కాబట్టి దంతాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దాని కోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మంచి టూత్ పేస్ట్ ఎంపిక చేసుకోవాలి. రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. చాలా మంది రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. ఎక్కువ సార్లు కాఫీ టీ తాగితే చిగుళ్ళు దంతాలు దెబ్బ తింటాయి.

ఈ సమస్య లేకుండా ఉండాలి అంటే కొంత శ్రద్ధ పెట్టాలి. దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి అరటిపండు తొక్క బాగా సహాయపడుతుంది. అరటిపండు తొక్కతో దంతాలను ఒక నిమిషం పాటు రుద్దాలి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వలన అరటి తొక్క లో ఉండే మా మాంగనీస్,మెగ్నీషియం, పొటాషియం పళ్ళ పై పేరుకుపోయిన మలినాలు గారను తొలగిస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ పంచదార తో తయారైన స్వీట్స్ వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."