MoviesTollywood news in telugu

Godavari Serial:స్టార్ మా ‘గోదావరి’ సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

Godavari Serial:ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అందులో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సరికొత్త కథనంతో వస్తున్న సీరియల్ ‘గోదావరి’ (Godavari). తక్కువ సమయంలోనే మంచి రేటింగ్స్ సొంతం చేసుకున్న ఈ సీరియల్‌లో, హీరోయిన్ ‘జాను’ (Janhvi) తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే, తెరపై నవ్వుతూ కనిపించే జాను రియల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంతకీ ఆమె తెలుగు అమ్మాయేనా? నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్న ఆమె పూర్తి వివరాలు మీకోసం..
godavari serial
చదువు ఆపేసి.. కుటుంబ భారం మోస్తూ..
గోదావరి సీరియల్ లో జానుగా నటిస్తున్న ముద్దుగుమ్మ అసలు పేరు అనుమిత దత్త (Anumita Dutta). ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ స్టోరీని పంచుకుని అందరినీ కంటతడి పెట్టించింది.

అనుకోని కుటుంబ పరిస్థితుల వల్ల మధ్యలోనే చదువును వదిలేయాల్సి వచ్చిందని, ఫ్యామిలీకి అండగా నిలబడేందుకు నటన వైపు అడుగులు వేసినట్లు ఆమె ఎమోషనల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగమ్మాయి కాదు.. బెంగాలీ బ్యూటీ!
చూడటానికి అచ్చమైన తెలుగమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుమిత.. నిజానికి బెంగాల్‌కు చెందిన ముద్దుగుమ్మ. 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది.

ఆ తర్వాత తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, ‘నువ్వుంటే నా జతగా’ సీరియల్‌లో ‘మిధున’ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన తొలి సీరియల్‌తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘గోదావరి’ సీరియల్‌తో ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

ఆశ్చర్యపరుస్తున్న రెమ్యునరేషన్.. నెలకు లక్షల్లోనే!
వరుస ఆఫర్లతో బుల్లితెరపై బిజీగా ఉన్న అనుమిత దత్త (Anumita Dutta Remuneration), గోదావరి సీరియల్ కోసం భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
godavari serial 1
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆమె రోజుకు దాదాపు రూ. 40 వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు లక్షల్లోనే ఆదాయం గడిస్తూ, తన కష్టాలకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటోంది.

ఒకప్పుడు కుటుంబం కోసం చదువు ఆపేసిన స్థాయి నుంచి.. ఇప్పుడు తన టాలెంట్‌తో నెలకు లక్షలు సంపాదిస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తోంది గోదావరి సీరియల్ ‘జాను’.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."