Beauty Tips

White Hair Turn Black:తెల్ల జుట్టుతో విసిగిపోయారా? పెరుగులో ఈ పొడి కలిపి రాస్తే నిగనిగలాడే నల్లటి కురులు మీ సొంతం!

White Hair Turn Black: ఒకప్పుడు 60 సంవత్సరాలకు వచ్చే తెల్లజుట్టు ఇప్పటి రోజుల్లో 25 నుంచి 30 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేస్తుంది. దాంతో బయటకు రావటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారు.

చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడి జుట్టు పాడుచేసుకోకండి. మీ ఇంట్లోనే సహజంగా దొరికే ఈ పవర్‌ఫుల్ పొడిని పెరుగులో కలిపి రాస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

ఇలా కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య వస్తుంది. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు.

ఇప్పుడు చెప్పే చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, అవసరమైన నీటిని పోసి బాగా కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కదపకుండా ఒక గంట అలా వదిలేయాలి.

ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

హెన్నా పొడి మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే గోరింటాకును నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. కెమికల్ హెయిర్ కలర్స్ కి బదులు ఈ ప్యాక్ వేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఖరీదైన ట్రీట్‌మెంట్స్ అవసరం లేదు. కేవలం పెరుగులో ఈ సహజసిద్ధమైన పొడిని కలిపి వారానికి ఒకసారి రాస్తే చాలు.. మీ కురులు ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడుతాయి. ఆ సింపుల్ హోమ్ రెమెడీని ఫాలో అయ్యి తెల్లజుట్టు సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."