BusinessDevotional

హైదరాబాద్ టూ తిరుమల క్యారవాన్ జర్నీ..ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది

వారాంతం రాగానే హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా కారు, బస్సు లేదా రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది!

ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ, ప్రయాణ బడలిక లేకుండా వెళ్లేందుకు క్యారవాన్ (Caravan) జర్నీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్రయాణం, విశ్రాంతి, నిద్ర.. అన్నీ ఒకే వాహనంలో లభించడం దీని స్పెషాలిటీ!

ఒకవేళ మీరు కూడా ఈసారి తిరుమలకు క్యారవాన్‌లో వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అసలు ఎంత ఖర్చు అవుతుంది? టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

రూట్ అండ్ డిస్టెన్స్
హైదరాబాద్ నుంచి తిరుమల వరకు రోడ్డు మార్గంలో సుమారు 600 కిలోమీటర్లు ఉంటుంది (రానుపోను కలిపి 1,200 కి.మీ).

కర్నూలు, కడప మీదుగా సాగే ఈ ప్రయాణంలో రోడ్లు చాలా అనుకూలంగా ఉంటాయి. దారి పొడవునా భోజనం, విశ్రాంతికి అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

క్యారవాన్ స్పెషాలిటీ ఏంటి?
కార్లలో అయితే కూర్చొని వెళ్లాలి, అదే క్యారవాన్‌లో అయితే పడుకుని కూడా వెళ్లొచ్చు.

సాధారణంగా క్యారవాన్‌లో 10 నుంచి 12 మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

రాత్రి వేళ 6 నుంచి 8 మంది హాయిగా నిద్రపోవడానికి బెడ్స్ ఉంటాయి.

వాష్‌రూమ్, వాటర్ ఫెసిలిటీ, స్టోరేజ్ స్పేస్ వంటి సదుపాయాలు ఉంటాయి. దీంతో తిరుపతిలో ప్రత్యేకంగా హోటల్ రూమ్ బుక్ చేసుకునే పనే ఉండదు. క్యారవాన్‌లోనే బస చేయొచ్చు.

3 రోజుల పర్ఫెక్ట్ టూర్ ప్లాన్
సాధారణంగా ఈ యాత్రను 3 రోజులుగా ప్లాన్ చేసుకోవచ్చు.

మొదటి రోజు: ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరితే, దారిలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంప్లీట్ చేసుకుని సాయంత్రానికి తిరుపతి చేరుకోవచ్చు. రాత్రికి క్యారవాన్‌లోనే బస చేయొచ్చు.

రెండో రోజు: ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత కిందకు వచ్చి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రాత్రి మళ్లీ క్యారవాన్ స్టే.

మూడో రోజు: ఉదయం తిరుగు ప్రయాణం మొదలుపెట్టి.. కడప, కర్నూలు మీదుగా ట్రాఫిక్ పరిస్థితులను బట్టి సాయంత్రం లేదా రాత్రికి హైదరాబాద్ చేరుకోవచ్చు.

బడ్జెట్ లెక్కలు.. ఒక్కొక్కరికి ఎంత పడుతుంది?
క్యారవాన్ అద్దెను కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తారు. సగటున కిలోమీటరుకు రూ.70 చొప్పున తీసుకున్నా.. 1200 కి.మీ లకు రూ.84,000 అవుతుంది. టోల్ గేట్లు, పర్మిట్, స్టేట్ ట్యాక్స్ అన్నీ కలిపి మరో రూ.6,000 వరకు వేసుకున్నా, టోటల్ ప్యాకేజీ దాదాపు రూ.90,000 వరకు వస్తుంది.

ఈ మొత్తాన్ని ప్రయాణికుల సంఖ్యతో పంచుకుంటే భారం ఈ విధంగా పడుతుంది:

12 మంది వెళ్తే – ఒక్కొక్కరికి రూ. 7,500
10 మంది వెళ్తే – ఒక్కొక్కరికి రూ. 9,000
8 మంది వెళ్తే – ఒక్కొక్కరికి రూ. 11,250
6 మంది వెళ్తే – ఒక్కొక్కరికి రూ. 15,000

గమనిక: పైన చెప్పిన చార్జీలకు తోడు రోజువారీ భోజన ఖర్చులు అదనంగా (దాదాపు రూ.600-రూ.1000 వరకు) ఉంటాయి.

బస్సులు లేదా టెంపో ట్రావెలర్లతో పోలిస్తే క్యారవాన్ ఖర్చు కాస్త ఎక్కువే అయినా.. లగ్జరీ, ప్రైవసీ, ఎక్కడా కాంప్రమైజ్ కాని కంఫర్ట్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."