Beauty TipsHealth

Instant Face Glow: పార్లర్ కు వెళ్లే పనిలేదు.. కాఫీ, అలోవెరాతో తెల్లగా మెరిసిపోయే ముఖం మీ సొంతం!

Alovera and coffee Face Glow Tips:ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోయి ముఖంపై మలినాలు, డస్ట్ వంటివి పేరుకుపోవడం సర్వ సాధారణం అయ్యిపోయింది. ముఖాన్ని ఆలా వదిలేస్తే ముఖం నల్లగా,నిస్తేజంగా మారిపోతుంది.

ముఖం కాంతివంతంగా కన్పించాలన్నా, తాన్,నలుపు వంటివి తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, మరియు ట్యాన్ తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కాఫీ, అలోవెరా (కలబంద) ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ.

కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగిస్తే, అలోవెరా చర్మాన్ని మృదువుగా మార్చి మచ్చలను తగ్గిస్తుంది.

ఈ ప్యాక్ ముఖ చర్మం నల్లగా లేకుండా తెల్లగా,కాంతివంతంగా మారుస్తుంది. ఈ ప్యాక్ అడ, మగ ఎవరైనా ట్రై చేయవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ కి మూడు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.

మొదటి ఇంగ్రిడియన్ కలబంద
కలబందలో ఉండే విటమిన్ C,E, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని బాగా శుభ్రం చేసి మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కలబంద జెల్ అయినా వాడవచ్చు.

రెండో ఇంగ్రిడియన్ కాఫీ పొడి
కాఫీ పొడి చర్మంలో రక్తప్రసరణను బాగా పెంచి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

మూడో ఇంగ్రిడియన్ పంచదార
పంచదార సహజసిద్ధమైన ఎక్స్ ఫ్లోట్ గా పనిచేసి చర్మం మీద ఉండే మలినాలను,మృతకణాలను తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా,అందంగా మార్చటంలో సహాయపడుతుంది.

ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పొడి వేయాలి. కాఫీ పొడి సుమారుగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ కలబంద జెల్ ని వేసి బాగా కలపాలి.

ఈ మూడు పదార్ధాలు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేయటానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి సున్నితంగా 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద పేరుకుపోయిన మలినాలు, మురికి, మృతకణాలు అన్ని తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. ఈ ప్యాక్ లో ఉండే పోషకాలు చర్మ రంగు మీద ప్రభావం చూపి తెల్లగా మారుస్తాయి.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఈ ప్యాక్ అడ, మగ ఎవరైనా ట్రై చేయవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."