Beauty TipsHealth

White Hair: ఈ అద్భుతమైన నూనెతో మీ తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

White Hair Turn Black : తెల్లజుట్టు సమస్యకు ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.ఈ రోజుల్లో పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది.

అలా తెల్లజుట్టు రాగానే అసలు కంగారూ పడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

పొయ్యి మీద పాన్ పెట్టి 50 ml కొబ్బరి నూనెను పోసి దానిలో రెండు కరివేపాకు రెమ్మలను ఆకులుగా విడదీసి వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ కలోంజీ గింజలను వేసి కరివేపాకు వేగే దాకా పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత దించి చల్లారాక వడకట్టాలి. ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను ప్రతి రోజు రాసుకోవాలి.

కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగు పరచటంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి నల్లగా మారేలా చేస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఫోలికల్స్ లోని పిగ్మెంట్ కణాలను కాపాడడానికి మరియు రోజు రోజుకు జుట్టు నలుపు రంగులో ఉంచడంలో సహాయపడుతుంది.

కలోంజీ గింజలలో ఉండే లినోలెయిక్ ఆమ్లం ఫోలికల్స్ లోని వర్ణద్రవ్యం కణాల క్షీణతను నిరోధిస్తుంది. దాంతో తెల్లజుట్టు నల్లగా మారుతుంది. కాస్త ఓపికగా రోజు రాసుకుంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."