Beauty Tips

పల్చటి జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. బంగాళాదుంపతో ఇలా చేయండి!

Fast hair growth secrets in Telugu :పల్చటి జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. బంగాళాదుంపతో ఇలా చేయండి.. ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.

అంతే కాకుండా జుట్టు రాలిపోతోందని, పలుచగా ఉందని, జుట్టు పెరగటం లేదని, రఫ్ గా ఉందని బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు.

మన ఇంట్లో దొరికే కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ తో సులభంగా తగ్గించుకోవచ్చు.ఈ రెమిడీ కోసం ఒక బంగాళదుంప తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా తురమాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి బంగాళదుంప తురుము వేసి బాగా ఉడికించాలి. ఉడికిన బంగాళదుంప తురుమును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

ఈ పేస్టు లో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలా పట్టించాలి. రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి .జుట్టు సిల్కీ గా మారుతుంది. అలాగే జుట్టు చిక్కు పడటం కూడా తగ్గుతుంది.

ఈ ప్యాక్ వేసుకోవటం వలన జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. బంగాళాదుంపలో ఉండే సమ్మేళనాలు జుట్టు తంతువులకు పోషణ అందించి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. బంగాళదుంపలలో విటమిన్లు బి, సి, ఐరన్ మరియు జింక్ అధికంగా ఉండుట వలన జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది.

విటమిన్ E Oil జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

అలాగే జుట్టు బలంగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది. స్కాల్ప్‌కు రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."