వంటలక్కకు చెమటలు పట్టిస్తున్న ‘కార్తీక దీపం 2’ జ్యోత్స్న రియల్ లైఫ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు బుల్లితెరపై ‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కార్తీక దీపం 2’ కూడా అదే రేంజ్‌లో రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. మొదటి పార్ట్‌లో ‘మోనిత’లాగా, ఇప్పుడు వంటలక్కను ఇబ్బంది పెడుతూ మెయిన్ విలన్‌గా అదరగొడుతున్న పాత్ర ‘జ్యోత్స్న’.
తన కన్నింగ్ యాక్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు విపరీతమైన కోపం తెప్పిస్తున్న ఈమె అసలు పేరు గాయత్రి సింహాద్రి. సీరియల్స్‌లో విలనిజం పండిస్తూనే, సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న ఈమె బ్యాక్‌గ్రౌండ్ విశేషాలు ఎన్నో ఉన్నాయి.
గాయత్రి సింహాద్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. కానీ, ఆమె పెరిగింది మాత్రం విశాఖపట్నంలో. చదువు పూర్తయ్యాక మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. ఆ రంగంలో సత్తా చాటుతూ ‘మిసెస్ వైజాగ్’ వంటి టైటిల్స్‌ను కూడా సొంతం చేసుకుంది.
అయితే, ఆమె నేరుగా సీరియల్స్ ద్వారా కాకుండా మొదట యాంకర్‌గా కెరీర్ ప్రారంభించడం విశేషం. బుల్లితెరపై ‘సూపర్ ఫ్యామిలీ’, ‘జోష్’ లాంటి పాపులర్ షోలను హోస్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతే నటనపై ఆసక్తితో సీరియల్స్ వైపు మళ్లింది.
2022లో ‘త్రినయని’ సీరియల్ ద్వారా టెలివిజన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గాయత్రి. అందులో నెగిటివ్ రోల్ పోషించి తొలి ప్రయత్నంలోనే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ‘పల్లకిలో పెళ్లికూతురు’ వంటి సీరియల్స్‌లో నటించినా, ఆమెకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘కార్తీకదీపం 2 నవ వసంతం’. ఇందులో లీడ్ విలన్ జ్యోత్స్నగా ఆమె చేస్తున్న కుట్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
స్క్రీన్ మీద కోపంగా, చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే గాయత్రి.. రియల్ లైఫ్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నం. ఇన్‌స్టాగ్రామ్‌లో (@gayathrisimhadrii) ఆమె మోడ్రన్, వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లో చేసే ఫొటోషూట్స్ చూస్తే ఈమె ఆ జ్యోత్స్నేనా అని ఆశ్చర్యపోవాల్సిందే. ట్రెండీ రీల్స్, గ్లామర్ షోతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కార్తీక దీపం 2 లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. షూటింగ్ గ్యాప్‌లో తోటి నటీనటులతో చేసే అల్లరి వీడియోలను కూడా ఆమె రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటుంది.
టాప్ రేటింగ్ ఉన్న సీరియల్‌లో మెయిన్ విలన్ అంటే ఆ రేంజ్, రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం లీడ్ విలన్లకు వాళ్ల క్రేజ్, సీనియారిటీని బట్టి రోజుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పారితోషికం అందుతోంది. జ్యోత్స్న పాత్రకు వస్తున్న ఆదరణ దృష్ట్యా గాయత్రి సింహాద్రి కూడా రోజువారీ కాల్‌షీట్‌కు అదే రేంజ్‌లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

