Beauty Tips

కేవలం ₹10 ఖర్చుతో జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా మరియు సిల్కీగా మారడం ఖాయం!

Hair Care Tips:వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం, పొడిబారడం అనేది ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య. జుట్టును ఒత్తుగా, స్ట్రెయిట్‌గా, సిల్కీగా మార్చుకోవడానికి చాలామంది కెమికల్స్ ఉన్న షాంపూలు వాడుతూ, హెయిర్ స్పా అంటూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.

కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం 10 రూపాయల ఖర్చుతో ఇంట్లోనే మీ జుట్టును అందంగా, మృదువుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ చెక్ పెట్టి, కురులను ఒత్తుగా పెరిగేలా చేసే ఆ అద్భుతమైన మ్యాజిక్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం

10 రూపాయిల ఖర్చుతో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా స్ట్రైట్ గా,మృదువుగా… ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా మృదువుగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అయితే చాలామంది జుట్టు చూస్తే గడ్డిలా ఎండిపోయినట్టు కనబడుతుంది.

అలాగే జీవం లేకుండా ఉంటుంది. జుట్టు సాఫ్ట్ గా చేయటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీనికోసం ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దాని నుంచి పాలు తీయాలి.

రెండు బాగా పండిన అరటి పండ్లను తీసుకుని మిక్సీలో వేయాలి. కొబ్బరి పాలను పోసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల వెన్న, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేయాలి, ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేయాలి. అరగంటయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

హెయిర్ ప్యాక్ తలస్నానం చేసిన జుట్టు పై లేదా నూనె ఉన్న జుట్టు పై కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ జుట్టుకు పోషణను అందించి జుట్టు మృదువుగా,స్ట్రైట్ గా, అందంగా, మెరిసేలా చేస్తుంది.అరటి పండ్లలో సిలికా అనే ఖనిజం ఉంటుంది. అది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.

అలాగే యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టును తేమగా ఉంచుతుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."