షేవింగ్ తర్వాత ముఖం మంటగా అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
Shaving Tips :చాలామందికి షేవింగ్ అనేది రోజువారీ దినచర్యలో భాగం. అయితే గడ్డం గీసుకున్న వెంటనే చర్మం ఎర్రబడటం, మంట పుట్టడం, చిన్నచిన్న కురుపులు (రేజర్ బర్న్స్) రావడం లాంటి సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. హడావిడిగా షేవింగ్ చేయడం లేదా సరైన ఆఫ్టర్-షేవ్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.
మీరు కూడా షేవింగ్ తర్వాత చర్మం మంటతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇకపై ఆ ఆందోళన వద్దు. షేవింగ్ సమయంలో, ఆ తర్వాత ఎలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం!
షేవింగ్ తర్వాత చర్మం మంట పెడుతుందా…ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. యుక్త వయసు నుంచి మగవారిలో గడ్డాలు మీసాలు రావడం సర్వసాధారణమే.

కొందరు వీటిని స్టైల్ గా మార్చుకుంటే మరికొందరు రేజర్ సాయంతో షేవ్ చేసుకుంటారు దాని కోసం రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు కొంతమందికి షేవింగ్ తర్వాత చర్మం మంట పుడుతుంది. దాని కోసం ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
కీర దోస చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి ఈ పేస్టు లో పాలను కలిపి మంట ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి
ఒక బౌల్లో ఒక స్పూన్ తేనె అరస్పూన్ నిమ్మరసం కలిపి మంట ఉన్న ప్రదేశం లో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు ఫాలో అవడం వలన మంట తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

