అల్లరి నరేష్ ‘కితకితలు’ మూవీ వెనుక ఉన్న సీక్రెట్స్.. ఆ రోజుల్లోనే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?
kithakithalu telugu movie songs : టాలీవుడ్‌లో కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటే అందులో కచ్చితంగా వినిపించే పేరు ‘కితకితలు’. దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కడుపుబ్బా నవ్వించే చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, కేవలం వినోదాన్ని మాత్రమే పంచడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, నిర్మాతలకు కనకవర్షం కురిపించి ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచింది. అసలు ఈ బ్లాక్ బస్టర్ సినిమా వెనుక ఉన్న ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు ఏంటి? షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? ఫైనల్‌గా ‘కితకితలు’ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల లాభాలను ఆర్జించింది? లాంటి నమ్మలేని నిజాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

కితకితలు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. అల్లరి నరేష్ ,గీతా సింగ్ హీరో హీరోయిన్స్ గా నటించిన కితకితలు మూవీ వెనుక ఎంతటి భయంకర మైన నిజాలున్నాయో ఈమధ్య ఓ ఇంటర్యూలో అల్లరి నేరేష్ చెప్పాడు. నిజానికి ఈ సినిమాలో నేను విలన్,తాను హీరో అయిపోయిందని చెప్పుకొచ్చాడు.
అంతకుముందు గీతా సింగ్ చాలా సినిమాలు చేసినా,ఈ సినిమాతో ఆమెకు ఎనలేని పేరు వచ్చింది. ఇప్పటికీ ఆమెకు ఆ సినిమాయే క్రెడిట్ గా నిలిచిపోయింది. అల్లరి నరేష్, గీతాసింగ్, వేణు మాధవ్ తదితరులు మాగంటి బాబు 5కె రన్ లాంటి ఈవెంట్ కి పిలిస్తే వెళ్లారట. రైలు దిగాక ఓ అమ్మాయి,అల్లరి నరేష్ చొక్కా పట్టుకుని ‘ఏంటి ,లావుగా ఉంటె వదిలేస్తావా, లావుగా ఉంటె మనుషులు కాదా,అసలు ఏమిటి నీ ఉద్దేశ్యం’ఇలా వరుస ప్రశ్నలతో నిలదీసేసిందట.
అయ్యో,అది సినిమా సరదాగా చేసిన సినిమా, అయినా చివరిలో లావు,సన్నం కాదు,మనసులు కలవాలి’అనే సందేశం ఇచ్చామని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడట. అయినా సరే,అమ్మాయి వినలేదట, నీ సినిమా చూసిన దగ్గరనుంచి మా ఇంట్లో కూడా మా ఆయన ఇలాగే లావు లావు అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. రోజు ఇలాగే సాధిస్తున్నాడు అంటూ ఆ అమ్మాయి కడిగిపారేసిందట.
నిజానికి ఇలాంటి సబ్జెక్ట్ గల మూవీ ఆడుతుందా అని అందరూ భయపెట్టడంతో 3కోట్లు అనుకున్న బడ్జెట్ ని 80,90లక్షల్లోనే చాలా టైట్ బడ్జెట్ లో చేశామని,అయితే ఆరోజుల్లో 8కోట్లు కలెక్ట్ చేసిందని అల్లరి నరేష్ వివరించాడు. విదేశాల్లో లావు సన్నం పట్టించుకోము. అయితే మనకిక్కడ ఓ ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాలో గీతా సింగ్ స్విమ్ సూట్ వేసుకుంటే, యూనిట్ లో వాళ్లంతా చాలా నవ్వేస్తున్నారు,దాంతో నేను చాలా ఫీలయ్యాను.
నిజ జీవితంలో ఇలా కూడా వెటకారంగా చూస్తారా అని చాలా బాధ పడ్డాను కూడా’అని అల్లరి నరేష్ వివరించాడు. ఏదైనా ఒకటి రెండు సార్లు అంటే పర్వాలేదు గానీ,నాలుగు సార్లు దాటాక కూడా లావు లావు అంటే ఎవరికైనా కోపం రావడం,చురుక్కుమనడం సహజం. అందుకే గీతా సింగ్ కూడా మెంటల్ టెన్షన్ పడింది కూడా’అని వివరించాడు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

