MoviesTollywood news in telugu

‘ఖైదీ నెంబర్ 150’కి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా?

Megastar Chiranjeevi Khaidi No 150 Movie : దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తో రీ-ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. 2017 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే, అదే పండుగకు చిరుకి పోటీగా నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శతమానం భవతి’ కూడా బరిలోకి దిగాయి. ఇంతటి భారీ పోటీలో మెగాస్టార్ ముందు ఆ సినిమాలు నిలబడగలిగాయా? వాటి బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి? అన్న ఆసక్తికరమైన విషయాలు ఈ ఆర్టికల్‌లో చదివేయండి.

మెగాస్టార్ సినిమాలు అంటే ఇప్పటికి అదే క్రేజ్ ఉంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. బాస్ ఈజ్ బాక్ అనే టాగ్ లైన్ తో రాజకీయాల నుంచి సినిమా రంగంలోకి ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

వివి వినాయక్ డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో చిరంజీవి 60 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా స్పెప్స్ ఇరగదీసాడు. చిరంజీవి ద్విపాత్రిభినయం చేసిన ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది.

2017జనవరి 11న రిలీజై, 150కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2016డిసెంబర్ 30న అల్లరి నరేష్ నటించిన చెట్టుమీద దెయ్యం నాకేం భయ్యం మూవీ వచ్చింది. జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ప్లాప్ అయింది.

డిసెంబర్ 30నే కారం దోశె మూవీ రిలీజయింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే నేనొస్తా మూవీ కూడా ప్లాపయింది. నారా రోహిత్, శ్రీవిష్ణు నటించిన సాగర్ కె చంద్ర తెరకెక్కించిన అప్పట్లో ఒకడుండేవాడు మూవీ ఏవరేజ్ అయింది. ఖైదీ నెంబర్ 150కి ఐదు రోజుల ముందు ఇంకేంటి నువ్వే చెప్పు మూవీ రిలీజయింది.

శివశ్రీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్లాపయింది. మనోజ్ నందన, స్మిత జంటగా నటించిన ఏ రోజు నిన్ను చూశానో మూవీ కూడా నిరాశపరిచింది. జనవరి 6నే పడమటి సంధ్యారాగం మూవీ వచ్చింది. ఇదీ పరాజయం పాలైంది. ఖైదీ నెంబర్ 150కి ఒకరోజు తర్వాత జనవరి 12న బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ రిలీజయింది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ 70కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.

జనవరి 14న ఆర్ నారాయణ మూర్తి నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజయింది. జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పరాజయం పాలైంది. జనవరి 14న వచ్చిన శతమానం భవతి మూవీ 50కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది.

సతీష్ వేగేశ్న డైరెక్టర్. ఇక హృత్రిక్ రోషన్ నటించిన బాలీవుడ్ మూవీ కబిల్ కి డబ్బింగ్ గా వచ్చిన బలం మూవీ ఏవరేజ్ గా నిల్చింది. మంచు విష్ణు నటించిన లక్కున్నోడు మూవీ ఆకట్టుకోలేదు. దీనికి రాజ్ కిరణ్ డైరెక్టర్.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."