అల్లు అర్జున్ ‘ఆర్య’ బ్యూటీ అనురాధ మెహతా గుర్తుందా? ఇప్పుడు ఎక్కడుందో.. ఏం చేస్తోందో తెలుసా?
2004లో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఆర్య’. అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ‘గీత’ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అమాయకమైన చూపులు, క్యూట్ స్మైల్‌తో కుర్రకారును ఫిదా చేసిన ఆ బ్యూటీ పేరు అనురాధ మెహతా.
ముఖ్యంగా ‘ఫీల్ మై లవ్’ అంటూ బన్నీ వెంటపడుతుంటే.. ముసిముసి నవ్వులు చిందిస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి, అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తోంది? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆర్య ఇచ్చిన క్రేజ్ నిలబడలేదా?
మోడలింగ్ రంగం నుంచి వచ్చి ‘ఆర్య’తో తెలుగు తెరకు పరిచయమైన అనురాధ, తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆమెకు తిరుగుండదని, టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె ఎంచుకున్న కథలు నిరాశపరిచాయి. 2005లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా వచ్చిన ‘నువ్వంటే నాకిష్టం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

ఆ తర్వాత 2007లో ‘మహారాజశ్రీ’, ‘వేడుక’ లాంటి సినిమాలు చేసినా.. అవేవీ ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో కన్నడ ఇండస్ట్రీకి మకాం మార్చింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘అజయ్’ (తెలుగు ‘ఒక్కడు’ రీమేక్) సినిమాలో నటించింది. ఇక 2008లో వచ్చిన ‘హొంగనసు’ సినిమానే ఆమె కెరీర్‌లో చివరిది. ఆ తర్వాత ఆమె వెండితెరపై మళ్లీ మెరవలేదు.
అసలు ఇప్పుడు ఎక్కడుంది?
2008 తర్వాత అనురాధ సినిమాలకు, గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఆర్య లాంటి హిట్ పడినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఆమె విఫలమైంది. సరైన కథలు ఎంచుకోకపోవడం, నటనలో వేరియేషన్స్ చూపించలేకపోవడం, దానికి తోడు కొత్త హీరోయిన్ల రాకతో ఇండస్ట్రీలో గట్టి పోటీ ఎదురై అవకాశాలు కరువయ్యాయి.
ఇక ప్రస్తుతం ఆమె ఎక్కడుంది? అనే విషయానికొస్తే.. ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయినట్లు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఆమె సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) కూడా యాక్టివ్‌గా లేరు. సినిమా ఈవెంట్స్, పార్టీలు, కనీసం ఇంటర్వ్యూలలో కూడా ఎక్కడా ఆమె జాడ లేదు. ఒక సాధారణ గృహిణిగా, సెలబ్రిటీ హోదాకు దూరంగా అత్యంత ప్రైవేట్‌గా తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు ఉన్నా రాని గుర్తింపు.. కొందరికి ఒక్క సినిమాతోనే వస్తుంది. అనురాధ మెహతా కూడా ఆ కోవకే చెందుతుంది. ఆమె నటించింది కొద్ది సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ అమాయకమైన ‘ఆర్య గీత’గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

