Beauty Tips

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా? కొబ్బరితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడం గ్యారెంటీ!

Coconut and tea tree oil Hair Fall Tips In telugu:వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారా? అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ కాకుండా, మన ఇంట్లో ఉండే కొబ్బరితో ఈ సింపుల్ రెమెడీ ఫాలో అయితే చుండ్రు పూర్తిగా మాయమై జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఆ అద్భుతమైన హెయిర్ కేర్ చిట్కా ఏంటో ఈ ఆర్టికల్‌లో మిస్ కాకుండా చదవండి.

మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించటానికి ఇంటిలోనే ఈ చిట్కాను తయారుచేసుకొని వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

అరకప్పు కొబ్బరిని తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి పాలను తయారుచేయాలి. ఈ కొబ్బరి పాలల్లో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.

ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటె జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది. జుట్టు కుదుళ్ళకు మంచి పోషణ అందుతుంది.

కొబ్బరి పాలలో ఉండే విటమిన్లు జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి, తద్వారా జుట్టు చిట్లడం చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలుట, తలలో దురద వంటి సమస్యలను తగ్గించటానికి కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మంచి పలితాన్ని పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."