నితిన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. ఈ కథలు ఓకే చేసి ఉంటే రేంజ్ వేరేలా ఉండేది!
టాలీవుడ్‌లో ‘లవర్ బాయ్’ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు నితిన్. ‘జయం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వరుస ఫ్లాపులు పలకరించినా.. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అ ఆ’, ‘భీష్మ’ వంటి సాలిడ్ హిట్స్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
అయితే, సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు ఎంత సహజమో.. మంచి కథలను వదులుకోవడం కూడా అంతే సహజం. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ, మరో హీరోకి కెరీర్ టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. అలా తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో నితిన్ ఏకంగా 12కు పైగా సినిమాలను వదులుకున్నాడు. వాటిలో ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి. మరి నితిన్ కాదనుకున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
1. ఆర్య (Arya):
అల్లు అర్జున్‌ను స్టార్ హీరోను చేసిన చిత్రం ‘ఆర్య’. డైరెక్టర్ సుకుమార్ ఈ కథను మొదట నితిన్‌కే వినిపించారట. కానీ, హీరో పాత్రకు ఉండే నెగెటివ్ షేడ్స్ (వన్ సైడ్ లవర్ కాన్సెప్ట్) కారణంగా నితిన్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు అప్పట్లో టాక్ నడిచింది.
2. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar):
వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇచ్చిన ఊరమాస్ బ్లాక్ బస్టర్ ఇది. ఈ స్టోరీని కూడా పూరి ముందుగా నితిన్ దగ్గరకే తీసుకెళ్లారట. నితిన్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ రామ్ వద్దకు వెళ్ళింది.
3. శతమానం భవతి (Shatamanam Bhavati):
శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ చిత్రం జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇంత మంచి ఫ్యామిలీ స్టోరీని నితిన్ వదులుకోవాల్సి వచ్చింది.
4. పిల్లా నువ్వు లేని జీవితం (Pilla Nuvvu Leni Jeevitham):
సాయి ధరమ్ తేజ్‌కి హీరోగా మంచి మాస్ అండ్ కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా ఇది. ముందుగా నితిన్ తోనే ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన పక్కకు తప్పుకున్నాడు.
5. రాక్షసుడు (Rakshasudu):
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ (తమిళ ‘రాట్ససన్’ రీమేక్). ఈ బౌండెడ్ స్క్రిప్ట్ నితిన్ తలుపు తట్టినా ఆయన ఈ రీమేక్ పై పెద్దగా ఆసక్తి చూపలేదట.
6. తెలుసు కదా (Telusu Kada):
స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఈ కథను ఆమె ముందుగా నితిన్‌కు వినిపించగా.. ఈ రోల్‌కి తనకంటే సిద్దు జొన్నలగడ్డ అయితేనే కరెక్ట్ అని నితిన్ భావించాడట. అంతేకాకుండా స్వయంగా సిద్ధుకు ఫోన్ చేసి మరీ ఈ ప్రాజెక్ట్ సెట్ చేశాడట.
7. ఒరేయ్ బుజ్జిగా (Orey Bujjiga):
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా వచ్చిన ఈ ఫన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ నిజానికి నితిన్ కోసమే రాసుకున్నారు. కానీ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఈ సినిమా రాజ్ తరుణ్ ఖాతాలోకి వెళ్ళింది.
ఇవి మాత్రమే కాకుండా…
వీటితో పాటు అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ మూవీ ‘మనం’లో ఓ చిన్న క్యామియో రోల్‌తో పాటు.. సుమంత్ నటించిన ‘ధన 51’, తరుణ్ ‘భలే దొంగలు’, పవర్ పేట, బాలీవుడ్ హిట్ ‘గల్లీ బాయ్’ తెలుగు రీమేక్, మా అమ్మ మహాలక్ష్మి వంటి సినిమాలను సైతం నితిన్ రిజెక్ట్ చేశాడు.
కథల జడ్జిమెంట్ విషయంలో ఎప్పుడూ ఒకేలాంటి ఫలితాలు రావు. ఏది ఏమైనా నితిన్ తనదైన శైలిలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలో ఆయన నటించిన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలతో నితిన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

