Business

దీపావళి బోనస్ స్కామ్: వాట్సాప్‌లో వచ్చే ఆ లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలతో వల వేస్తుంటారు. ఈ దీపావళికి ‘బోనస్’ పేరుతో సరికొత్త స్కామ్‌కు తెరలేపారు. “దీపావళి సందర్భంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం మీకు రూ.5,000 బోనస్ ఇస్తోంది.

కింద ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి” అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్‌లలో మెసేజ్‌లు తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో ఉండే లింక్స్ (ఉదాహరణకు: http://diwali-bonus-gov.in) చూడటానికి అచ్చం ప్రభుత్వ వెబ్‌సైట్‌లాగే ఉంటాయి కాబట్టి చాలామంది ఈజీగా నమ్మి మోసపోతున్నారు.

అసలు మోసం ఎలా జరుగుతుంది?
మీరు ఆ ఫేక్ లింక్ క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు లాంటివి ఎంటర్ చేయమని అడుగుతారు.

కొన్నిసార్లు “ఈ బోనస్ డబ్బులు మీ అకౌంట్‌లో పడాలంటే ₹99 ప్రాసెసింగ్ ఫీజు కట్టండి” అని కూడా అడుగుతారు.

మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వగానే, బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ఫోన్‌లోకి ఒక ఏపీకే (APK) ఫైల్ లేదా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది.

అంతే, ఆ తర్వాత మీ ఓటీపీ (OTP), యూపీఐ పిన్ (UPI PIN) హ్యాకర్ల చేతికి వెళ్లిపోయి, క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది.

ఈ స్కామ్ నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు మస్ట్‌:
వాట్సాప్‌లో వచ్చే “ఫ్రీ గిఫ్ట్స్, దీపావళి బోనస్” లాంటి లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. ఏ ప్రభుత్వమూ వాట్సాప్ లింక్స్ పంపి డబ్బులు పంచదు అని గుర్తుంచుకోండి.

నిజమైన ప్రభుత్వ వెబ్‌సైట్లకు చివరన ఎప్పుడూ .gov.in ఉంటుంది. http://diwali-bonus.com లాంటి ఫేక్ వెబ్‌సైట్లను నమ్మకండి. తెలియని లింక్స్ ద్వారా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకండి.

ఫోన్ చేసి ప్రభుత్వ అధికారులమని చెప్తూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు లేదా మీ ఆధార్ నంబర్ అడిగితే అస్సలు చెప్పకండి.

మీకు ఇలాంటి ఫేక్ లింక్ వస్తే, దాన్ని మీ కాంటాక్ట్స్‌కి, గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేయకండి.

ఒకవేళ మీరు మోసపోయినట్లు అనుమానం వస్తే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."