హెన్నాలో ఈ పదార్ధం కలిపి రాస్తే తెల్లజుట్టు సహజంగా నల్లగా మారుతుంది!
White Hair To Black Hair:హెన్నాలో కలిపి వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.. వాతావరణంలో మారిన పరిస్థితి,ఒత్తిడి మరియు జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు.
అలా కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే ప్రొడక్ట్స్ వాడితే సరిపోతుంది. లవంగ నూనె తెల్లజుట్టును నల్లగా మార్చటంలో సహాయపడుతుంది. లవంగ నూనెలో యూజినాల్ అనే రసాయనం ఉండుట వలన తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.
అలాగే యూజీనాల్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన జుట్టు కుడుళ్ళను బలంగా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. ఒక బౌల్ లో 5 స్పూన్ల హెన్నా పొడి, మూడు స్పూన్ల రోజ్ water,4 చుక్కల లవంగం నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
ఈ రేమిడి తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్య మరియు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. హెన్నా పొడి మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే గోరింటాకును ఎండబెట్టి పొడిగా తయారుచేసుకొని వాడవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

