హెయిర్ ఫాల్‌తో భయపడుతున్నారా? అయితే వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసుకోండి!
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య.. జుట్టు రాలడం! చుండ్రు, హెయిర్ డ్యామేజ్, జుట్టు నిర్జీవంగా మారడం, చిట్లిపోవడం వంటి సమస్యలతో ఎంతో మంది సతమతమవుతున్నారు.
పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, పని ఒత్తిడి, అలాగే వంశపారంపర్య కారణాల వల్ల ఈ జుట్టు సమస్యలు వస్తున్నాయి.

అయితే, జుట్టు ఆరోగ్యానికి సంబంధించి మనలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది.. వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? చాలా మంది “ఎక్కువసార్లు తలస్నానం చేస్తే.. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది” అని భావిస్తుంటారు.
కానీ, ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి, జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే తలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
తప్పక చదవండి..
వేడి పాలలో తులసి ఆకులు వేసి మరిగించి తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? 🔥
ఇప్పుడే చూడండి
నిపుణులు ఏమంటున్నారంటే..
జుట్టు రకాల ఆధారంగా, స్త్రీ పురుషుల వారీగా తలస్నానం చేసే విధానంలో చిన్న మార్పులు చేసుకోవాలి:
మహిళలు: వారంలో 3 నుంచి 4 సార్లు తలస్నానం చేయడం ఉత్తమం.
పురుషులు: వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఇలా తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందని అస్సలు భయపడాల్సిన పనిలేదు. తల శుభ్రంగా ఉంటేనే కుదుళ్లు బలంగా ఉంటాయి.

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దానికి తోడు విపరీతమైన చెమట నేరుగా తలలో చేరుతుంది. దీనివల్ల త్వరగా దుమ్ము చేరి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమ్మర్ లో జుట్టుపై తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
చిన్న చిట్కా: మీకు చుండ్రు లేదా ఇతర హెయిర్ సమస్యలు ఉంటే, ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ వేసుకుని తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
తప్పక చదవండి..
ఉదయం టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే వాటికి బదులు ఈ ‘మ్యాజిక్ జ్యూస్’ తాగితే రక్తహీనత పరార్! 🔥
ఇప్పుడే చూడండి

