పూజలో మారేడు, తులసి దళాలతో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే సకల దరిద్రాలు మీ వెంటే!
మన హిందూ సాంప్రదాయంలో మారేడు దళాలకు, తులసి దళాలకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. కానీ, దేవుడికి పూజ చేసే సమయంలో చాలామంది తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి, మారేడు ఆకులను తుంచే విషయంలో ఆ తప్పులు చేస్తే… మీరు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం దక్కదట! పైగా దోషం కూడా అంటుకుంటుందని పండితులు చెబుతున్నారు.
మరి ఆ తప్పులేంటి? మారేడు, తులసి దళాలను ఎప్పుడు కోయకూడదు? ఏయే దేవుళ్లకి అస్సలు వాడకూడదు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!

తులసి దళాల నియమాలు
మొదటగా తులసి దళాల గురించి మాట్లాడుకుందాం. శాస్త్రాల ప్రకారం తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా కోయకూడదు.
ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో తులసిని కోయకూడదు.
అలాగే ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి సమయాల్లో కూడా తులసిని ముట్టుకోరాదు.
సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తుంచడం మహా పాపం!
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం… స్నానం చేయకుండా తులసిని తాకడం కానీ, కోయడం కానీ చేయకూడదట.
అలాగే తులసిని ఏ దేవుళ్లకి వాడకూడదో తెలుసా?
వినాయకుడికి తులసిని అస్సలు సమర్పించకూడదు. పురాణాల ప్రకారం గణేశుడికి, తులసికి మధ్య జరిగిన ఒక శాపం వల్ల వినాయక పూజలో తులసి దళాలను వాడరు. అలాగే పరమశివుడి పూజలో కూడా తులసిని వాడకూడదు. తులసి భర్త అయిన జలంధరుడిని శివుడు సంహరించిన కారణంగా శివపూజకు తులసి ఆకులను దూరంగా ఉంచుతారు.
ఇవి కూడా చదవండి:
మారేడు దళాల నియమాలు
ఇక పరమశివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల (Bilva Leaves) విషయానికి వస్తే…
చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులలో మారేడు ఆకులు కోయకూడదని శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా సోమవారం నాడు మారేడు దళాలు అస్సలు కోయకూడదు! శివుడికి సోమవారం పూజ చేయాలి కాబట్టి, చెట్టును ఇబ్బంది పెట్టకుండా… ఒక రోజు ముందే అంటే ఆదివారమే మారేడు దళాలు కోసి పెట్టుకోవాలి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… మారేడు దళాలను సూర్య భగవానుడి పూజలో వాడకూడదట. సూర్యారాధనలో వీటిని ఉపయోగించే ఆచారం లేదు. మారేడు దళాలను కేవలం పరమశివుడికి మరియు శ్రీ సూక్త విధానంలో లక్ష్మీదేవి పూజకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు.

అసలు కారణం – మినహాయింపులు
మన పెద్దలు ఈ నియమాలు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇవి కేవలం పూజా ద్రవ్యాలు మాత్రమే కాదు, గొప్ప ఔషధ మొక్కలు. ఇష్టానుసారంగా కోయడం వల్ల వాటిలోని శక్తి క్షీణిస్తుంది. నిర్దిష్ట సమయాల్లో ఆకులను కోయకపోవడం అనేది మనం ప్రకృతికి ఇచ్చే గౌరవం!
మరికొంత మందికి ఒక డౌట్ రావచ్చు.. “అత్యవసరంగా పూజకు ఆకులు కావాలంటే ఏం చేయాలి?” అని. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చెట్టుకు నమస్కరించి, మనస్ఫూర్తిగా అనుమతి అడిగి కోయడం ఉత్తమం.
మరో అద్భుతమైన విషయం ఏంటంటే… ఒకసారి కోసిన తులసి, మారేడు దళాలు చాలా రోజుల వరకు పవిత్రతను కోల్పోవు. అవి వాడిపోయినా సరే మళ్లీ నీటితో కడిగి పూజకు వాడుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

