కేవలం 1 రోజులో పులిపిర్లు మాయం.. డాక్టర్‌తో పనిలేకుండా ఇంట్లోనే ఇలా చెక్ పెట్టండి!
ముఖంపై లేదా మెడపై పులిపిర్లు (Warts) వచ్చాయంటే అందం పాడవుతుందని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. ప్రతి 15 మందిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అంచనా.
వీటిని తొలగించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే పులిపిర్లను నొప్పి లేకుండా సులభంగా రాల్చేయొచ్చు. ఆ అద్భుతమైన ఇంటి చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి?
పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (HPV).
ఇవి చర్మం రంగులో లేదా ముదురు గోధుమ రంగులో గరుకుగా, బొడిపెల మాదిరిగా ఉంటాయి.
సాధారణంగా ఇవి ముఖం, మెడ, చేతులు, పాదాలపై ఎక్కువగా వస్తుంటాయి.
వీటివల్ల పెద్దగా నొప్పి ఉండదు కానీ, చూడటానికి కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఒత్తిడి పడే ప్రదేశాల్లో వస్తే కాస్త ఇబ్బంది పెడతాయి.
మగవారికంటే ఆడవారిలో, ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి.

పులిపిర్లను రాల్చే పవర్ఫుల్ ఇంటి చిట్కా:
కావాల్సిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు – 2
నిమ్మరసం – 1/2 స్పూన్
బేకింగ్ సోడా – 1/4 స్పూన్
ఇవి కూడా చదవండి:
తయారీ, వాడే విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు వెల్లుల్లి పాయలను మెత్తని పేస్ట్‌లా దంచుకుని వేయాలి.
ఆ వెల్లుల్లి పేస్ట్‌లో అర స్పూన్ నిమ్మరసం, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో మాత్రమే రాసి, దానిపై ఒక బ్యాండెజ్ (Band-aid) వేయాలి.
కచ్చితంగా ఒక గంట పాటు దాన్ని అలాగే వదిలేసి, ఆ తర్వాత బ్యాండెజ్ తీసేసి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ విధంగా ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తుంటే.. వెల్లుల్లి, నిమ్మరసంలో ఉండే యాంటీ వైరల్, అసిడిక్ లక్షణాల వల్ల పులిపిర్లు నిర్జీవంగా మారి చాలా త్వరగా వాటంతట అవే రాలిపోతాయి. కాస్త ఓపికగా ఈ చిట్కా పాటిస్తే అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది.

ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు, చిట్కాలు కేవలం మీ సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఇతర చర్మ సమస్యలు లేదా సెన్సిటివ్ స్కిన్ ఉంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించిన తర్వాతే పాటించడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

