ఉదయాన్నే పరగడుపున వాము నీటిని 3 రోజులు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మన వంటింట్లో సులభంగా దొరికే పోపు దినుసుల్లో ‘వాము’ (Ajwain) ముందు వరుసలో ఉంటుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంలో వామును మించిన ఔషధం లేదు.
ముఖ్యంగా వాతావరణం మారుతున్న ప్రస్తుత సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలన్నింటికీ వాము నీరు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన పూర్వీకులు, ఆయుర్వేద నిపుణులు సైతం వామును ఎంతో గొప్పగా చెబుతారు.

కేవలం మూడు రోజుల పాటు ఉదయాన్నే ఈ వాము నీటిని తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఏంటో, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము నీరు – తయారీ విధానం
వాము నీటిని తయారు చేసుకోవడం చాలా సులభం:
ముందుగా ఒక స్పూన్ వాము తీసుకుని దోరగా వేయించుకోవాలి.
వేయించిన వామును ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఆ నీటిని బాగా మరిగించి, వడకట్టుకోవాలి.
ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే పరగడుపున తాగాలి.

వాము నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
గ్యాస్, అజీర్ణానికి చెక్: ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, పుల్లటి త్రేన్పులు, అజీర్ణం వంటి పొట్ట సమస్యలన్నీ ఇట్టే తొలగిపోయి కడుపు చాలా తేలికగా మారుతుంది.
బరువు తగ్గడంలో సహాయం: వాములో ఉండే ‘థైమోల్’ (Thymol) కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా, శక్తిగా మారి బరువు సులభంగా తగ్గుతారు.

మలబద్ధకం నివారణ: గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా ఎదుర్కొనే మలబద్ధకం సమస్యను నివారించడంలో వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి:
చర్మం, జుట్టు సమస్యలు మాయం: వాములోని థైమాల్ చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. వాము పొడిలో కాస్త నీళ్లు కలిపి పేస్ట్‌లా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, జుట్టు రాలే సమస్యను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.
సీజనల్ వ్యాధులకు స్పెషల్ టిప్!
దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఒక గ్లాసు నీటిని వేడి చేసి.. అందులో అర స్పూన్ వాము, 4 తులసి ఆకులు వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత వడకట్టుకుని తాగితే గొంతు నొప్పి, జలుబు నుంచి వెంటనే మంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే పాటించడం మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

