తొలి ఏకాదశి 2026: ఈ ఒక్క చిన్న పరిహారంతో మీ అప్పుల బాధలన్నీ పరార్.. ఎలాగో తెలుసా?
హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే ‘తొలి ఏకాదశి’ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలు పాటిస్తే.. ఆ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశి విశిష్టత ఇదే..
ఈ ఏడాది (2026) తొలి ఏకాదశి జూలై 25, శనివారం నాడు వస్తోంది. ఈ పర్వదినం నుంచే శ్రీ మహావిష్ణువు సుమారు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తాడు. దీనినే ‘చాతుర్మాస్యం’ అంటారు. ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యత మొత్తం పరమశివుడిపై పడుతుంది. ఈ పవిత్ర మాసంలో శ్రీహరిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి.

అప్పులు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడాలంటే.. ఈ పనులు చేయండి:
పీటపై పసుపు వస్త్రం: తొలి ఏకాదశి రోజున ఒక పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై శ్రీ మహావిష్ణువు పటాన్ని ఉంచాలి. ఆ తర్వాత స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి మనసారా పూజిస్తే అప్పుల బాధలు శాశ్వతంగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవికి ఎర్ర కుంకుమ: విష్ణుమూర్తితో పాటే లక్ష్మీదేవి కూడా యోగనిద్రలోకి వెళ్తుంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీ నారాయణులను ఇద్దరినీ కలిపి పూజించాలి. ముఖ్యంగా అమ్మవారికి ఎర్ర కుంకుమను సమర్పిస్తే.. మీ ఇంట సిరిసంపదలకు లోటు ఉండదు.
విష్ణు సహస్రనామ పారాయణం: ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
తులసి పూజ: శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. కాబట్టి ఈ పవిత్ర దినాన తులసి కోట వద్ద దీపారాధన చేసి, తులసి మాతను పూజించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది.
గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

