Ragi Onion Pakoda: రాగి పిండితో ఉల్లిపాయ పకోడీ ఇలా చేస్తే కరకరలాడుతూ భలే రుచిగా వస్తుంది!
Ragi Onion Pakodi Recipe: ఉల్లిపాయ పకోడి పేరు వింటేనే చాలు నోట్లో నీళ్లూరుతాయి. అందరు ఇష్టపడి తినే శనగ పిండి అందరికి సరిపడదు. అలాంటివారు రాగి పిండితో ఉల్లి పకోడి చేసి చూడండి ఎన్ని అయినా లాగించేయచ్చు.
రాగి పిండితో ఉల్లిపాయ పకోడీ ఇలా చేస్తే కరకరలాడుతూ భలే రుచిగా వస్తుంది.. వర్షాకాలం లేదా సాయంత్రం చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా కరకరలాడుతూ తినాలనిపిస్తోందా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో ఇలా ఉల్లిపాయ పకోడీ చేసి చూడండి! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
సాధారణ శనగపిండి పకోడీల కంటే ఇది చాలా భిన్నంగా, ఎంతో క్రిస్పీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. తక్కువ నూనె పీల్చుకుంటూ, చాలా తక్కువ సమయంలో ఇంట్లోనే ఈ హెల్తీ రాగి పకోడీని ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
రాగిపిండి- ½ కప్పు
పల్లీలు- ½ కప్పు
ఎండుమిర్చి – 7
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉల్లిపాయ చీలికలు – 250 గ్రాములు
నూనె – ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.పల్లీలు, ఎండుమిర్చి మిక్సిలో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
2.గిన్నెలో ఉల్లిపాయ చీలికలు,ఉప్పు వేసి ఉల్లిపాయరసం పిండుతూ బాగా కలుపుకోవాలి.
3.పిండిన ఉల్లిపాయల్లో రాగి పిండి, గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
4.అవసరం అయితే కొద్ది కొద్దిగా నీళ్లు ఆడ్ చేసుకోని పిండిని తడిపొడిగా కలుపుకోవాలి.
5.స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి కలుపుకున్న పిండిని పకోడిలా జారవిడిచి మీడియం ఫ్లేమ్ పై వేపుకోవాలి.
6.పూర్తిగా చల్లారాక పకోడి కర కర లాడుతుంది.

