IRCTC Ayodhya Tour: వందే భారత్‌లో అయోధ్య రామయ్య దర్శనం.. ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ, పూర్తి వివరాలు మీకోసం!
IRCTC Ayodhya Tour: వందే భారత్‌లో అయోధ్య రామయ్య దర్శనం.. ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ, పూర్తి వివరాలు మీకోసం!
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అలాంటి భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” (Ram Lalla Darshan Ayodhya) పేరుతో కేవలం 2 రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణం, హోటల్ బస, భోజనం అన్నీ కలిపి అత్యంత అనుకూలమైన ధరకే ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్యాకేజీ హైలైట్స్ ఇవే..
ప్యాకేజీ పేరు: రామ్ లల్లా దర్శన్ అయోధ్య
కవర్ చేసే ప్రదేశాలు: సరయూ ఘాట్, రామ్ లల్లా ఆలయం, హనుమాన్ గఢీ, కనక్ భవన్
ప్రయాణం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (చైర్ కార్ – CC)
ఎక్కడి నుంచి?: ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ), ఉదయం 6:10 గంటలకు.
ఎప్పుడెప్పుడు?: ప్రతి శుక్రవారం, శనివారం
ప్యాకేజీ ధరల వివరాలు
ఈ టూర్ ప్యాకేజీ ధర మీరు ఎంచుకునే షేరింగ్ ఆప్షన్‌ను బట్టి మారుతుంది.
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ. 16,170
డబుల్ షేరింగ్: రూ. 10,950
ట్రిపుల్ షేరింగ్: రూ. 9,700
పిల్లలకు (5–11 ఏళ్లు, బెడ్‌తో): రూ. 9,360
పిల్లలకు (5–11 ఏళ్లు, బెడ్ లేకుండా): రూ. 8,980
టూర్ షెడ్యూల్ సాగుతుందిలా..
మొదటి రోజు:
ఉదయం 6:10 గంటలకు ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్) నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. దారిలో రైలులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందిస్తారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా ఏసీ వాహనంలో హోటల్‌కు తీసుకెళ్తారు.
ఫ్రెషప్ అయిన తర్వాత సాయంత్రం పవిత్ర సరయూ నది ఘాట్, ఆ తర్వాత రామ్ లల్లా ఆలయంలో శ్రీరాముడి దర్శనానికి తీసుకెళ్తారు. రాత్రికి హోటల్‌లోనే భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు:
ఉదయం టిఫిన్ చేసిన తర్వాత హనుమాన్ గఢీ, కనక్ భవన్ దర్శనం ఉంటుంది.
మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ చెక్-అవుట్ చేసి, భోజనం పూర్తిచేస్తారు.
మధ్యాహ్నం 2:15 గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని, 3:20 గంటలకు వందే భారత్‌లో తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 11:40 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలో ఏముంటాయి? ఏముండవు?
ఇవి ఉంటాయి:
వందే భారత్ CC క్లాస్ అప్ అండ్ డౌన్ రైలు టికెట్లు.
అయోధ్యలో ఏసీ హోటల్ బస (ఒక రాత్రి).
రైల్వే స్టేషన్ – హోటల్ – సైట్ సీయింగ్ కోసం ఏసీ వాహనం.
రైలులో, హోటల్‌లో శాకాహార భోజనం (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్), జీఎస్టీ.
ఇవి ఉండవు:
వ్యక్తిగత ఖర్చులు (టిప్స్, లాండ్రీ, వాటర్ బాటిల్స్).
గుడిలో స్పెషల్ దర్శనం టికెట్లు, ఆరతి పాస్‌లు.
షెడ్యూల్‌లో పేర్కొనని అదనపు దర్శనాలు లేదా ఇతర ప్రవేశ రుసుములు.
భక్తులు గమనించాల్సిన ముఖ్య విషయాలు
ఈ టూర్‌లో ఎలాంటి వీఐపీ (VIP) లేదా ప్రాధాన్యత దర్శనం ఉండదు. అందరిలాగే సాధారణ క్యూలైన్‌లోనే వెళ్లాలి.
వాతావరణం, ట్రాఫిక్ లేదా రైలు ఆలస్యం వల్ల ఏదైనా ప్రదేశం లేదా దర్శనం మిస్ అయితే ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు, రీఫండ్ కూడా ఉండదు.
ప్రయాణంలో తప్పనిసరిగా ఆధార్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలి.
ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

