MoviesTollywood news in telugu

2018 లో వచ్చిన ఈ మూవీస్ కి జండూబామ్ అవార్డులు ఇవ్వాల్సిందే

Zandu balm award movies:సినిమా హిట్ అయితే కలెక్షన్స్ వర్షం,ఇక అవార్డులే అవార్డులు. కళాత్మక చిత్రాలకైతే జాతీయస్థాయి అవార్డులు కూడా వచ్చేస్తాయి. బాగున్నా సినిమాలకు కాంప్లిమెంట్స్ ఇలా ఉంటె మరి ఏమాత్రం బుర్ర పెట్టకుండా ఏదో సినిమా తీయాలి అన్నట్లు గా తీసే సినిమాలు చూడాలంటె పరమ బోర్ కొడతాయి. తలనొప్పి కూడా కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.
Richest tollywood heroes
ఎందుకు వచ్చాం రా బాబు అనేట్లు కొన్ని సినిమాలు ఉంటాయి. నటన ఉండదు. పాటలు వినసొంపుగా ఉండవు. పరమ చెత్తగా ఉంది సినిమా అనే నిట్టూర్పులు సహజమే. ఇక ఇలాంటి సినిమాలకు కూడా కేరళలో వెటకారంగా కోకోనట్ అవార్డ్స్ ఇచ్చి తమ నిరసన తెలుపుతారు. దీంతో సినిమాలు తీసేటప్పుడు కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

మరి ఇలాంటి చెత్త మూవీస్ కి మన తెలుగులో జండూ బాం అవార్డ్స్ ఇవ్వాల్సిందే. ఆ కోవలోకి 2018లో విడుదలైన మూవీస్ ఏమి ఉన్నాయో ఓసారి చూద్దాం. రామ్ గోపాల్ వర్మ తీసిన ఆఫీసర్ మూవీ ఎందుకు తీశారో తెలీదు. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వరద బాధితుల మాదిరిగా మిగిలిపోయారని అంటారు. వర్మను ఓ సారి ఆ సినిమా చూడవయ్య బాబు అంటే అసలు పట్టించుకోడు. ఇక ఆ సినిమా హీరో నాగార్జున అయితే ఆ టైటిల్ పేరు వింటేనే వణికిపోతాడు. అంత చెత్త డిజాస్టర్ మూవీ అది.

వర్మ ఇలాంటి సినిమా తీస్తే నాకు కూడా ఆలాంటి మూవీ తీయడం వచ్చని నిరూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన జండూబామ్ అవార్డు మూవీ అజ్ఞాతవాసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమా ఇది.

ఇక బాగా హైప్ క్రియేట్ చేసిన పెద్ద సినిమాల్లో జైసింహ ఒకటి. డిస్ట్రిబ్యూటర్లకు నట్టేట ముంచిన సినిమా ఇది. బాలయ్య నటించిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి.

ఇక తానూ తక్కువ తినలేదంటూ విజయ దేవరకొండ నోటా తడాఖా చూపించేసింది. నారా రోహిత్ నటించిన వీర భోగ వసంతరాయలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. మాట్లాడకపోతే ఇంకా మంచిది.

నాగసౌర్య నర్తన శాల,అమ్మమ్మగారి ఇల్లు రెండూ జండూబామ్ మూవీస్ లోకే వెళ్లిపోయాయి. ఇక హలొ గురు ప్రేమకోసమే మూవీ కూడా జండూబామ్ అవార్డుల్లోకి వచ్చింది. దర్శకుడు, రామ్ పోతినేని మనపై దండయాత్ర చేశాడా అన్నట్లు ఈ మూవీ ఉంది.
manchu vishnu
ఇక మంచు వారి అబ్బాయి విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్ లో ఆచారి అమెరికా యాత్ర పేరిట ఓ సినిమా తీసి వదిలేసాడు. నిజానికి దీని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తమ్మడు మనోజ్ లా ఏ మూవీ తీయకపోవడమే మంచిదని అంటే సరిపోతుంది.

ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలతో అంటే ఇంటిలిజెంట్,తేజ్ ఐ లవ్ యు మూవీస్ తో మెగా ఫ్యామిలీ మెంబర్ సాయిధర్మ తేజ్ కూడా ఈ లిస్టులోకి వచ్చేసాడు. పోనీ గోపీచంద్ అయినా ఫర్వాలేదా అంటే,పంతం పట్టి మరీ పంతం పేరిట తీసిన కళాఖండం ఆడియన్స్ ని హింసించి వదిలిపెట్టింది