Movies

శ్రీదేవి ఫ్యామిలీలో ఉన్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?నమ్మలేని నిజాలు

తెలుగు , హిందీ ,తమిళ,మళయాళ, కన్నడ భాషల్లో ఓ ఊపేసిన అగ్రశ్రేణి స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఫామిలీ నుంచి ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి,ఎక్స్ పోజింగ్ కి సైతం వెనకాడకుండా దూసుకెళ్లిన ఒక నటి వుంది. ఆమె స్టార్ డమ్ తెచ్చుకున్నాక సడన్ గా ఇండస్ట్రీకి దూరం అయింది. ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఔరా అంటారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? పెళ్లి చిత్రంలో తన నటనతో చెరగని ముద్రవేసిన గులాబీ మూవీ ముద్దుగుమ్మ మహేశ్వరి. ఈమె స్వయంగా శ్రీదేవికి చెల్లెలు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో రాణించింది.

మహేష్, సూర్య కళ దంపతులకు జన్మించిన మహేశ్వరి జయకృష్ణన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లాడింది. తొలిసారిగా తెలుగు వెండితెరపై నీకోసం మూవీతో హీరోయిన్ గా మెరిసింది. అదేవిధంగా తమిళంగా కరుతువ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. నీకోసం తెలుగు మూవీ పెద్దగా ఆడకపోయినా తన నటనతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఛాన్స్ లు వెల్లువెత్తాయి.

ఇక 1995లో వచ్చిన గులాబీ మూవీ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. కుర్రకారులో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి. గులాబీ మూవీ హీరోయిన్ మహేశ్వరికే కాదు హీరో చక్రవర్తి,క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీకి ఇలా అందరికి పేరొచ్చింది. మృగం,దెయ్యం,పెళ్లి,ఉల్లాసం,వీరుడు,మా బాలాజీ,తిరుమల తిరుపతి వేంకటేశ వంటి మూవీస్ లో నటించినప్పటికీ తొలిసినిమా ఇచ్చిన గుర్తింపు మరో సినిమాకు రాలేదని చెప్పాలి.

సినిమా కెరీర్ బాగానే ఉన్నప్పటికీ వెండితెరకు హఠాత్తుగా దూరమైన మహేశ్వరి సడన్ గా జి తెలుగులో మై నేమ్ ఈజ్ మంగతాయారు అనే సీరియల్ తో బుల్లితెరపై దర్శనమిచ్చింది. ఇలా మూడేళ్ళ పాటు టివి ఆడియన్స్ ని కూడా మహేశ్వరి అలరించింది. ఇక ఆమె పెళ్లి తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తోంది. ఎంతోమంది సెలబ్రిటీలకు డిజైన్స్ అందిస్తూ రాణిస్తోంది.