Politics

జనసేన ప్రచార రధం సౌకర్యాలు చూస్తే షాకవుతారు

ఇక సార్వత్రిక ఎన్నికల సందడి సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు జనంలోకి దూసుకెళ్లడానికి పధక రచన చేస్తున్నాయి. ఏ పార్టీలో తమకు భవిష్యత్తు బాగుంటుందో చూసుకుని మరీ ఆయా పార్టీల్లోకి జంప్ చేస్తూ తమ సీట్ రిజర్వ్ చేస్తుకునే ప్రయత్నంలో పడ్డారు. ఓపక్క అధికార టిడిపి ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేయగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ప్రచార రథాలను ఇటీవల ప్రారంభించారు. ప్రతిరోజూ 170గ్రామాలను కవర్ చేసేలా ప్రచార రథంపై తిరగడానికి ప్లాన్ చేసారు.

ఓ పక్క టిడిపి,మరోపక్క జనసేన ప్రచార రథాలను సిద్ధం చేసుకోవడంతో పాటు రాజకీయ సమీకరణాలవైపు దృష్టిపెట్టాయి. నాయకులు అటుఇటు పార్టీలు మారడంతో ఎవరి బలం ఎంతో అనేది లెక్కలేసుకుంటున్నాయి. రోజురోజుకీ జంప్ లు చేసేవారి సంఖ్య పెరగడంతో బలాబలాలు కూడా అంచనాలు మారిపోతున్నాయి. జనసేన హైటెక్ హంగులతో సిద్ధం చేసిన ప్రచార రథాలు రోడ్డెక్కబోతున్నాయి. ప్రచార పర్వాన్ని హీటెక్కించబోతున్నారు.

వేగంగా దూసుకుపోవడం కాకుండా నెమ్మదిగా ప్రచార రథాలు వెళ్తూ ఎక్కువమంది జనాన్ని ఆకర్షించేలా జనసేన వ్యూహకర్తలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రధాల్లో ఎల్ ఈడి స్క్రీన్స్ ఏర్పాటుచేశారు. వీటిద్వారా పవన్ ప్రసంగాలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లేలా చూడాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు,
జనసేన గుర్తు జనంలోకి వెళ్లేలా గాజుగ్లాస్ లతో చాయ్ కూడా ఇచ్చేలా ప్రచార రథాలను రూపొందించారు. అందుకే ఒక్కో రధం 10గ్రామాల్లో తిరిగేలా చూస్తున్నారట. ఈలెక్కన 17రధాలు 170గ్రామాలను కవర్ చేస్తాయి. ఇలా అన్ని జిల్లాల్లో ప్రచార రథాలు తిరిగేలా చూస్తున్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."