Movies

సిల్క్ స్మిత సంపాదన అంతా ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఒక్కసారి తెరమీద కనిపిస్తే చాలు తమకు కాసుల పంటపండుతుందని చాలామంది దర్శక నిర్మాతలు ఆమె గురించి భావించేవారు. ఆమె సిల్క్ స్మిత. సెక్స్ సింబల్ గా నిల్చిన ఈమె పై ఓ పాట తీసి వదిలితే చాలు హిట్ అవుతుందని ఎదురుచూసిన దర్శక నిర్మాతలున్నారు. అలా తన శరీరాన్ని చూపించి వెండితెరపై మెరుపులు మెరిపించి సిల్క్ స్మితకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొచ్చేవారు. ఈవిధంగా లెక్కలేనంత సొమ్ము వచ్చి పడింది. ఈ సొమ్ములో తక్కువ మొత్తంలో ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టింది. అయితే కొన్ని సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వడం,రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం చేసింది.

ఇలా పెట్టుబడిపెట్టిన సినిమాలు డిజాస్టర్ కావడంతో అప్పట్లో నాలుగు కోట్ల రూపాయలను సిల్క్ స్మిత నష్టపోయింది. ఇక తనకు ఎవరైనా కోటి రూపాయలిస్తే తనజీవితం సాఫీగా నడుస్తుందని ప్రాధేయపడింది. అయినా అప్పట్లో ఎవరూ ముందుకు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పటికీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను సైతం ఆదుకున్నాడు గానీ స్మితకు సాయం చేయలేదు.

అభిమానికి ప్రమాదం జరిగిందని తెల్సి లక్షలాది రూపాయలిచ్చిన రజనీకాంత్ చివరకు స్మితకు రూపాయికి కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాగే ఎన్నో సినిమాలకు రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సూపర్ స్టార్ కృష్ణ తనకు బాగా పరిచయమైన నటి ఇబ్బందుల్లో ఉంటె పట్టించుకోలేదు. తెరవెనుక ఆమెతో సంబంధాలున్నాయన్న అపప్రద వస్తుందన్న ఉద్దేశ్యంతో కృష్ణ,రజనీకాంత్ ఆదుకోలేదన్న మాట వినిపించేది.

ఇక ఎందరికో సాయం అందించిన స్మితకు కష్టకాలంలో ఎవరూ పలకరించడానికి కూడా రాలేదు. అయితే ఆమె సొంతూరులో ఆమెకు కొన్ని ఆస్తులున్నాయని,సాలిగ్రామంలో ఒక ఇల్లు ఉందని అనేవారు. వాటిని ఫామిలీ మెంబర్స్ కి ఇవ్వడం వలన తిరిగి అడగలేకపోయిందని అంటారు. సొంతిల్లు అమ్మేసి అప్పులు తీర్చేద్దామంటే పరువు తక్కువ యవ్వారంగా భావించింది.

మొత్తం మీద తనలో తాను కుమిలిపోయి,తీవ్రంగా కృశించి పోయిందని అంటారు. తాను నమ్మిన డాక్టర్ రాధాకృష్ణ కూడా మోసం చేయడం,తాను ప్రేమించిన హీరో కూడా దెబ్బతీయడం,ఇలా తన డబ్బు ఆశించినవాళ్ళే తప్ప తనను ఆదుకోడానికి ఎవరూ రాలేదని ఆమె తెగ బాధపడిపోయేదట. అదే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిందని కొందరు అంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."