నితిన్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా?
యువ హీరో నితిన్ నిజామాబాద్ స్వస్థలం అయినా ఉన్నత విద్య అంతా హైదరాబాద్ నారాయణ గుడాలోని రత్నా కాలేజీలో సాగింది. తండ్రి ఎంకరేజ్ మెంట్ తో జయం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి,తొలిమూవీతోనే విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దిల్ , సై సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయింది వంటి మూవీస్ తో యువ హృదయాలను గెలుచుకున్న లవర్ బాయ్ నితిన్ ఆతర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అ ఆ మూవీ లో చేసి క్లాసికల్ హీరో అయ్యాడు.

కాలేజ్ డేస్ లో ఉండగానే జయం మూవీతో ఛాన్స్ రావడంతో నితిన్ క్లాస్ రూమ్ కి గుడ్ బై చెప్పేసి మేకప్ రూమ్ వైపు అడుగులు వేసాడు. బాలీవుడ్ మూవీ అజ్ఞాతలో నటించాడు. దక్షిణ భారత క్లాత్ బ్రాండ్ కార్టూన్ కింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక ఇష్క్ మూవీలో లచ్చమ్మ అనే సాంగ్ తో తనలోని గాయకుణ్ణి బయటకు తీసాడు.

ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్,నిర్మాతగా ఉన్నారు. అయితే తండ్రి మాదిరిగా నిర్మాతగా మారి అఖిల్ మూవీ తీసాడు. సిక్స్ ప్యాక్ హీరో జాబితాలో కూడా చేరిన నితిన్ పలు సినిమాలతో విజయాలను అందుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు.

