Movies

బుల్లితెర‌పై సీనియర్ హీరోయిన్ రాధిక ఎన్ని గంటలు నటించి రికార్డ్ సృష్టించిందో తెలుసా?

ఒకప్పుడు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ రాధిక కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటూ సీరియ‌ల్స్ చేస్తోంది. త‌మిళ‌నాట వ‌ర‌స సీరియ‌ల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను నిత్యం పలకరిస్తోంది. ముఖ్యంగా ఈమె న‌టించిన చాలా సీరియ‌ల్స్ సంచ‌ల‌నం సృష్టించాయి. రేటింగ్స్ ప‌రంగా కూడా చ‌రిత్ర కు కొత్త అర్ధం చెప్పాయి. అయితే ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌టికి ఈమె వెల్లడించింది. ఆమె చెప్పినదాన్ని బట్టి బుల్లితెర‌పై స‌రికొత్త రికార్డు సృష్టించింది. టీవీల్లో ఈమె ఏకంగా 3430 గంటల పాటు సీరియల్స్‌లో క‌నిపించార‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

అబ్బో గొప్పలేమో అనుకోవచ్చు కానీ ఈమె ఇప్పుడు నిజంగానే బుల్లితెర‌పై అంత‌సేపు క‌నిపించింది. ప‌క్కా లెక్క‌లు చెబుతున్న పచ్చి నిజాలు. మొత్తానికి ఇది చూసి రాధిక ఫాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఏదైనా ఒక ప‌ని ముగించ‌కుండా చేస్తుంటే ఏంట్రా సీరియ‌ల్ మాదిరి సాగ‌దీస్తున్నావ్ అంటారు క‌దా.. ఇప్పుడు రాధిక ఇదే చేసింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 7 వేల ఎపిసోడ్స్ చేసి, ఈ సీనియ‌ర్ హీరోయిన్ కొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది .

అంటే దాదాపు 6850 ఏపిసోడ్స్ అన్న‌మాట‌. ఇంత సమయం బుల్లితెరపై క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ రాధికా శ‌ర‌త్ కుమార్ ఇది చేసి చూపించింది. దీనికి చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతుంది ఈ సీనియ‌ర్ హీరోయిన్. ప్ర‌స్తుతం కొన్ని రోజులుగా న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఈమె త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ ఇస్తుందట. ఈవిధంగా అటు సినిమాల‌తో పాటు ఇటు సీరియ‌ల్స్ కూడా ఈమె చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."