Movies

నిన్నటి వరకు రాములమ్మ అన్నారు.. ఇప్పుడు లైన్‌లోకి శివగామి వచ్చింది?

భరత్ అను నేను సినిమా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత మొదలుపెట్టిన మహర్షి మూవీ సెట్స్ పైకి వచ్చింది. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే9న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే మహర్షి ఇంకా విడుదల కాకుండానే, మహేష్ 26కి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్ కి ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ పెడుతున్నట్లు ఇప్పటికే ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. కాగా హీరోయిన్ గా రిటైర్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఇష్టపడని విజయశాంతి కూడా ఇందులో కీలక రోల్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. 

ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి చొరవ చేసి విజయశాంతిని ఒప్పించాడన్న టాక్ ఇప్పటికే బలంగా వచ్చింది. షూటింగ్ రోజున అధికారికంగా ఈ విషయం ప్రకటిస్తారని అంటున్నారు. ఇక ఈ మూవీలో ఆల్రెడీ జగపతిబాబు కన్ఫర్మ్ అయ్యాడు. తాజా అప్ డేట్ ఏంటంటే ఇందులో శివగామి రమ్యకృష్ణ ఎంట్రీ కూడా ఉంటుందట. తనకు మాత్రమే సెట్ అయ్యే ఓ పవర్ ఫుల్ పాత్ర అనిల్ స్క్రిప్ట్ లో ఉందని ఈ వారం పది రోజుల్లో విన్పించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడని వినిపిస్తోంది.

ఇక ఇదంతా చూస్తుంటే మహేష్ 26 మూవీలో ముప్పై ఏళ్ళ క్రితం తెరను ఏలిన స్టార్లు ఇందులో క్యూ కట్టేలా ఉన్నట్లు టాక్. అంతేకాదు, జగపతిబాబుకి విజయశాంతితో ఆశయం రమ్యకృష్ణతో ఆయనకిద్దరు లాంటి సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు కూడా ఉండనే ఉంది. ఇప్పుడీ ముగ్గురు కలిసి మహేష్ కోసం టై అప్ అవ్వడం మామూలు విషయం కాదు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోయే ఈ మూవీని ఆరు నెలల లోపే పూర్తి చేసే టార్గెట్ తో యూనిట్ బరిలో దిగనుంది. మహర్షి ఫలితం ఓ కొలిక్కి వచ్చాక దీన్ని లాంఛనంగా సెట్స్ పైకి తీసుకువెళ్తారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడబోతున్నాయి.