Kitchenvantalu

స్వీట్ తినాలనిపిస్తోందా?: అప్పటికప్పుడు సులువుగా చేసుకునే ‘బనానా బర్ఫీ’

Banana Barfi:బనానా బర్ఫీ..ఇంట్లో ఉన్న పదార్ధాలతోటే ఎన్నో వెరైటీ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు.బర్ఫీ అనగానే కాజు బర్ఫీలే గుర్తొస్తాయి .కాని బనానాతో బర్ఫీ ఎప్పుడైన ట్రై చేసారా .ఈ సారీ చేసి చూడండి. స్వీట్ తినాలనిపిస్తోందా?: అప్పటికప్పుడు సులువుగా చేసుకునే ‘బనానా బర్ఫీ’..

కావాల్సిన పదార్ధాలు
అరటి పండ్లు – 3
చక్కెర – ½ కప్పు
పాలు – 2 కప్పులు
కొబ్బరి పౌడర్ – ½ కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా

తయారీ విధానం

1.అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోని మెత్తగా మాష్ చేసుకోవాలి.
2.అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోని రెండు కప్పుల పాలను వేసి మరిగించుకోవాలి.
3.పాలు మరిగాక మాష్ చేసుకున్న అరటి పండ్లను వేసి కలుపుకోవాలి.
4.కలుపుతూ మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.

5.మిశ్రమం కాస్తా చిక్కపడ్డాక అందులోకి కొబ్బరి పొడి వేసి నిమిషం పాటు కలుపుకోని ,చక్కెర కూడ యాడ్ చేసుకోవాలి.

6.చక్కెర కరిగాక యాలకుల పొడి వేసి చిక్కపడ్డాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి.
7.స్టవ్ ఆఫ్ చేసుకోని ఒక ట్రేలో నెయ్యి అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ట్రే అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
8.బర్ఫీ పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
9.రెండు గంటల తర్వాత ఇష్టమైన షేప్స్ లో బర్ఫీని కట్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."