అఖిల్ కెరీర్ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుసా ?
పాపం అక్కినేని నట వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్ కి మూడు సినిమాలు చేసినా ఎక్కడా హిట్ పడలేదు. మొదట్లోనే ‘అఖిల్’ సినిమాతో అఖిల్ ఎంట్రీ ఇవ్వగా,వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా దారుణ పరాజయాన్ని చవి చూసింది. దీంతో రంగంలోకి దిగిన నాగార్జున ‘హలో’ సినిమా ఎంపిక చేయగా, విక్రమ్ కుమార్ తెరకెక్కిం చాడు. అయినా కూడా అఖిల్‌కు హిట్ దక్కలేదు. ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో చేసిన ‘మిస్టర్ మజ్ను’ మూవీ సైతం ప్లాప్ కావడంతో అఖిల్ నిరాశలో పడిపోయాడు. అయితే ఏమనుకున్నాడో ఏమో ఎలాగైనా అఖిల్‌ను హిట్ ట్రాక్ ఎక్కించేందుకు నాగార్జున తన కొడుకు బాధ్యతను ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేతి కి అప్పగించాడు.
అఖిల్‌కు మంచి హిట్ ఇచ్చే ఉద్దేశంతో కథలు విన్న అరవింద్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చెప్పిన ప్రేమ కథని ఓకే చేసాడట. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన భాస్కర్ ఆ తరువాత ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీశాడు.ఇక మళయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘బెంగళూరు డేస్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి విజయాన్ని దక్కించుకోలేక పోయాడు.
అయితే భాస్కర్ అద్భుతమైన కథ చెప్పడంతో అరవింద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అతి త్వరలో పట్టాలెక్క నున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందాన నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్, తమన్ పేర్లను పరిశీలించిన ప్పటికీ చివరకు ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్‌ను ఒకే చేశారు. అరవింద్ , భాస్కర్ ల కాంబినేషన్ అఖిల్ ని గట్టెక్కిస్తుందా?

