Movies

సినిమా కోసం టాప్ లో నడుస్తున్న స్కూల్ ని అమ్మేశాడు… కానీ ఈ రోజు….???

సినిమా ఇండస్ట్రీలో కొన్ని విచిత్రాలు, వింతలూ ఉంటాయి. వద్దనుకున్న సినిమా ఒప్పుకుంటే తీరా అది డిజాస్టర్ అయితే అయ్యో అనవసరంగా ఒప్పుకున్నాం అనిపిస్తుంది. ఒకవేళ వదిలేసుకున్నాక అసలు విషయం తెల్సి అయ్యో ఛాన్స్ మిస్ చేసుకున్నానే అనిపిస్తుంది. సరిగ్గా ఓ నటుడి విషయంలో ఇదే జరిగింది.  కొండ రమేష్ బాబు అనే రమేష్ బాబు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇతగాడు ఆర్ధిక పరిస్థితి బాగున్నాకే సినిమా పరిశ్రమకు వెళ్లాలని భావించాడు. అందుకే 1991లో ఓ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాడు. ఎకనామిక్స్ టీచర్ గా కూడా చేసాడు.

స్కూల్ బాగా సక్సెస్ కావడంతో నటించడానికి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నాడు. దాంతో 11లక్షలకు స్కూల్ ని అమ్మేశాడు.హైద్రాబాద్ వచ్చేసి ప్రసాద్ కలర్ ల్యాబ్ లో నాగినీడు దగ్గర నెలకు 1300జీతానికి కుదిరాడు. అయితే బాగా చదువుకుని ఇలా సినిమాలేంటి అని నాగినీడు ప్రశ్నిస్తూ 1300జీతానికి పనిచేస్తే ఎలా అన్నారు. అయినా సరే ఛాన్స్ ల కోసం ఉండిపోయాడు. 1998లో ల్యాబ్ కి వచ్చిన దర్శకుడు వైవిఎస్ చౌదరి ద్వారా సీతారామరాజు మూవీలో మొదటి సారి నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆవిధంగా 198సినిమాల్లో చేసాడు.

అయితే వివి వినాయక్ డైరెక్షన్ లో దిల్ సినిమాలో వచ్చిన ఛాన్స్ తో ల్యాబ్ రమేష్ కాస్తా దిల్ రమేష్ గా మారిపోయాడు. అంతేకాదు రెమ్యునరేషన్ డిమాండ్ కి తగ్గట్టు వచ్చేది. తాను మాట్లాడుతుంటే జనం చప్పట్లు కొట్టాలన్నదే తన యాంబిషన్ గా చెప్పే రమేష్ అందుకోసమే, స్కూల్ సైతం అమ్మేసి, సినిమా రంగానికి వచ్చానని చెబుతాడు. ఇక ఈమధ్య వచ్చిన యాత్ర సినిమాలో వైఎస్ పాత్ర చుట్టూ తిరిగే పాత్రలో ఇమిడిపోయాడు. సూరీడు పాత్రేమో అనిపిస్తుంది. అంతవరకూ బానేఉంది. కానీ యాత్ర సినిమాలో ముమ్ముట్టి పక్కన కదా అని ఒప్పేసుకున్నాడు.

అదేసమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సైరా మూవీలో అఫర్ వదిలేసుకున్నాడు. సీతారామరాజు నుంచి లెజెండ్ ,సింహా వరకూ అన్ని సినిమాల్లో కత్తిపట్టి పరుగెత్తడం,నరకడం వంటి సీన్స్ లో నటించానని, నిజానికి ఇలాంటి రోల్స్ చేసేటప్పుడు ఎంతోవత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని,పైగా ఫైటర్స్ కి బ్యాక్ పెయిన్,జాయింట్లు సరిగ్గా పనిచేయక పోవడం వంటివి షరా మామూలేనని చెబుతాడు. అందుకే కూల్ కంఫర్ట్ పాత్ర కోసం యాత్ర మూవీలో తొలిసారి డిఫరెంట్ రోల్ వేశానని రమేష్ చెప్పుకొచ్చాడు.