Politics

జగన్ కొత్త కాన్వాయ్ లోని స్పెషాల్టీస్ ఏమిటో తెలుసా?

ఏపీలో 151సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రి కాబోతున్న వైస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రుల నియామకం వారం పదిరోజుల్లో ఉంటుంది. 

ఏర్పాట్లలో భాగంగా జగన్ కి కేటాయించిన కాన్వాయ్ పరిశీలిస్తే,తాడేపల్లిలో జగన్ పార్టీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీని టైట్ చేసారు. ఉండవల్లిలో జగన్ నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు,నేతలు వస్తున్నందున పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. అందుకే భద్రత పెంచారు. మెటల్ డిటెక్టర్లు,డాగ్ స్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. 

ఇక జగన్ కి బులెట్ ప్రూఫ్ వాహనం,మొబైల్ సిగ్నల్ జామర్,అంబులెన్స్,సెక్యూర్టీ సిబ్బంది వాహనాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. ఎపి 18పి3418నెంబర్ తో ఆరు వాహనాలను జగన్ నివాసం దగ్గర సిద్ధం చేసారు. కేంద్ర హోమ్ శాఖ ఆదేశం మేరకు జగన్ కి జెడ్ కేటగిరీ కూడా కేటాయిస్తున్నారు. ఎపి సెక్యూరిటీ వింగ్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, చంద్రబాబు సెక్యూరిటీని చూసిన అమర్లపూడి జోషిని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పోలీస్ శాఖ నియమించింది.