కార్తీక దీపం సీరియల్ లో భాగ్యం బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
కార్తీక దీపం సీరియల్ లో దీపకి సవతి తల్లిగా,మురళీకృష్ణకు భార్యగా భాగ్య లక్ష్మి కనిపిస్తుంది. వరూధిని పరిణయం సీరియల్ లో ఈమె రవికృష్ణకు తల్లిగా నటించింది. ఈమె అసలు పేరు ఉమా శాంతి. సెయింట్ మేరీస్ స్కూల్, అన్నామలై యూనివర్సిటీలో ఈమె చదువుకుంది.
కార్తీక దీపం వంటి మంచి సీరియల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సీరియల్ లోకి రాకముందు బండ్ల గణేష్ తో కల్సి సారీ ఆంటీ అనే బి గ్రేడ్ మూవీలో నటించింది.ఈ మూవీ 2003ఏప్రియల్ 28న విడుదలైంది. చిత్రం శ్రీను ,గుండు హనుమంతరావు,జయలలిత ,పొట్టి వీరయ్య,తదితరులు ఇందులో నటించారు. మురళీకృష్ణ , శ్రీనివాస్ నిర్మించిన సారీ ఆంటీ మూవీని ఎన్ కుమార్ డైరెక్ట్ చేసాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ఖతర్నాక్ మూవీలో టీచర్ గా చేసింది.
హీరో నితిన్ నటించిన సై మూవీలో విలన్ భిక్షు యాదవ్ సరసన నటించిన ఉమ ఇంకా గిలిగింతలు,అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ , అబ్బాయ్ ప్రేమలో పడ్డాడు, నేను అనే మూవీస్ లో కూడా నటించింది. అర్జున్ రెడ్డి మూవీలో హీరో విజయ్ దేవరకొండ హాస్పిటల్ లో ఉమ కనిపిస్తుంది. ఈమెకు ఓ 19ఏళ్ళ కూతురుంది. కూతురిని హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటోంది.

