Movies

2020 సంక్రాంతి హీరోలు…. గెలుపు ఎవరిదో?

వచ్చే సంక్రాంతికి బరిలో నిలిచే హీరోలు వీళ్ళే పండగ వస్తే సినిమాల సందడి ఉంటుంది. అందునా సంక్రాంతి పండగొస్తే ఇక చెప్పక్కర్లేదు. మొన్న సంక్రాంతికి ఏకంగా నాలుగు మూవీస్ వస్తే ,అందులో ఎఫ్ 2ఒక్కటే బ్లాక్ బస్టర్ అయింది. మరి వచ్చే సంక్రాంతికి పోటీ భారీగానే ఉంటుందని అంటున్నారు. టాప్ హీరోలు 2020సంక్రాంతికి రేసులోకి వస్తున్నారు. పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. 

మహర్షి మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సైన్ చేసిన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీ టైటిల్ విడుదలైంది. ఈ మూవీ 2020సంక్రాంతికి వస్తున్నట్లు పోస్టర్ లోనే ప్రకటించారు. ఇక సాహో మూవీ తర్వాత సైన్ చేసిన ప్రభాస్ మూవీ జాన్ వచ్చే సంక్రాంతికి బరిలో నిలవబోతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం విశేషం. 

అందుకే యూత్ లో క్రేజ్ నెలకొంది. సాహో మూవీ ఆగస్టులో విడుదలైతే, జాన్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న మూవీ కూడా వచ్చే సంక్రాంతి రేసులో ఉంది. పక్కా ఫామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తికాగా, రెండవ షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. హిట్ లక్ష్యంగా తెరకెక్కించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.