Movies

అగ్నిసాక్షి సీరియల్ శంకర్ బాబు కొడుకులా చేసే ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

స్టార్ మా ఛానల్ లో కార్తీక దీపం తర్వాత అంతటి పేరుగల సీరియల్ అగ్ని సాక్షి అని చెప్పాలి. ఇందులో శంకర్ బాబు గా అర్జున్ అంబటి, గౌరీగా ఐశ్వర్య నటిస్తున్నారు. వీరిద్దరికీ రీసెంట్ గా మంచి పేరు కూడా వచ్చింది. ఇక తాజాగా బుల్లి శంకర్ బాబు సీరియల్ లో అడుగుపెట్టాడు. దాంతో సీరియల్ ఇంకా బాగుందన్న టాక్ వచ్చింది. 

నాన్నగారు నేను మీ కొడుకుని అంటూ ఈ బుడ్డోడు చెప్పే మాటలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ కుర్రాడి అసలు పేరు అద్వైత్. అచ్చం శంకర్ బాబు లా నటించడం వలన సీరియల్ లో ఉన్నవాళ్ళంతా నిజంగా శంకర్ బాబు కొడుకునే అనుకుంటున్నారట. ఈ కుర్రాడు ఎక్కడి వాడో తెలియదు కానీ ఈ కుర్రాడితో దిగిన ఫోటోని,గౌరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో వైరల్ అయింది. 

కాగా గౌరికి నవ్య స్వామి అన్నయ్యతో నిశ్చితార్ధం జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక నిశ్చితార్ధం గురించి తెలుసుకున్న గౌరీ అభిమానులు కొంచెం ఫీలవుతున్నారని చెప్పాలి. సీరియల్ లో శంకర్ బాబుతో జోడీ కట్టడం చూసాక రియల్ లైఫ్ లో మరొకర్ని పెళ్లాడుతోందని ఫాన్స్ నిరాశకు గురయ్యారట

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."