జబర్దస్త్ లో రోజా కొనసాగుతుందా… మానేస్తుందా….???
సీనియర్ హీరోయిన్, యాక్ట్రెస్, యాంకరింగ్, రాజకీయ వేత్త గా రాణిస్తూ ఎపి ఐ ఐ సి చైర్మన్ గా కూడా తాజాగా నియమితులైన రోజా సినిమాలు, రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసింది. ఇక బుల్లితెరపై సందడి చేసింది. ముఖ్యంగా ఈటివి జబర్దస్త్‌లోకి జడ్జీగా ఎంట్రీ ఇచ్చి ఆ ప్రొగ్రామ్ సక్సెస్‌లో తానూ ఓ భాగమైంది. తాజాగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో రకరకాల గాసిప్స్ వినిపించాయి.
వీటన్నింటిని కొట్టేస్తూ, తనకి ఎప్పుడూ ఏ పదవి ఇవ్వాలో తమ నాయకుడు జగన్‌కి బాగా తెలుసు అని రోజా వాటికి చెక్ పెట్టేసింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి.. జబర్దస్త్‌లోనూ జడ్జిగా చేసినా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు అధికారపక్షంలో ఉండడంతో ఆమెకి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోజా జబర్దస్త్ చేస్తుందా? గతంలో మాదిరిగా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుందా? ఒకవేళ జబర్దస్త్‌ని వదిలేస్తుందా అనే సందేహం అందరిలోనూ ఉంది.
మరి ఇప్పటికీ దీనిపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ.. ఆ విషయం త్వరలోనే తేలనుంది. అయితే ఎన్ని పనులున్నాసరే జబర్దస్త్‌లో కచ్చితంగా చేస్తానని ఇప్పటికే రోజా ఎన్నోసార్లు చెప్పింది. ఎన్నో ఒత్తిళ్లతో కూడుకున్న తన రంగంలో జబర్దస్త్ తనకో ఊరట అని తెలిపింది. ఈనేపథ్యంలో పదవి వచ్చినా కూడా జబర్దస్త్‌ని రోజా వీడదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి జబర్దస్త్‌లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది త్వరలో తేలనుంది.
