Movies

విజయ నిర్మల మృతి తర్వాత కృష్ణ ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉండబోతున్నాడో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూయడంతో ఆమెకు అంతిమ సంస్కారాలను ఆమె కుమారుడు నరేష్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయ కృష్ణ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణ ఫ్యామిలీ , పలువురు ఫాన్స్ , ప్రముఖులు హాజరయ్యారు. వీళ్లిద్దరు సాక్షి సినిమాలో నటించాక ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాకా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఒకరిని ఒదిలి ఒదిలి మరొకరు ఉండలేమన్న రీతిలో ఇద్దరూ ఒకరికి ఒకరుగా బతికారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ వెళ్లడంతో కృష్ణ ఎక్కడుంటే అక్కడే విజయనిర్మల ఉంటుందన్న భావన కల్గించారు. 

ఇద్దరూ ప్రేమగా తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. దాదాపు ఏభై ఏళ్లపాటు సాగిన వారి బంధం ఇప్పుడు విజయనిర్మల మరణంతో విడివడింది. సూపర్ స్టార్ కృష్ణ ఎంతో దిగులుపడి పోతున్నారు. కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. దీంతో కృష్ణ ముందు భార్య ఇందిరాదేవి,కొడుకులు రమేష్,మహేష్,ముగ్గురు కూతుళ్లు తల్లడిల్లిపోతున్నారు. ఇన్నాళ్లూ విజయనిర్మలతో ఉన్న కృష్ణను ఇప్పుడు తమతో ఉండండి అంటే తమతో ఉండండని రమేష్,మహేష్,ముగ్గురు కుమార్తెలతో పాటు నరేష్ కూడా వేడుకుంటున్నారట. 

విజయ నిర్మల లేని బాధ నుంచి కృష్ణ అప్పుడే కోలుకోలేరని కృష్ణ పరిస్థితి చూసిన వారికి అర్ధం అవుతోంది. కనీసం ఇప్పుడైనా నాతొ కల్సి శేష జీవితం గడపాలని మొదటి భార్య ఇందిరాదేవి కోరుతున్నారట. ఇష్టం వచ్చిన చోట ఉండాలని అయితే ఒంటరిగా మాత్రం కుదరదని అందరూ నిర్ణయించారట. అయితే కృష్ణ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా బాధతో ఉండిపోతున్నారట. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండని,అయితే ఒంటరిగా మాత్రం ఉండొద్దని ఫ్యామిలీ  మొత్తం కోరుతూ, నిర్ణయాన్ని ఆయనకే వదిలేసారట. మరి కృష్ణ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.