ఈ రోజు జేష్ఠ అమావాస్య నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
రేపు జేష్ఠ అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు నుంచి 4 రాశుల వారికి బాగా కలిసివస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. రేపు జేష్ఠ అమావాస్య. జేష్ఠ అమావాస్య అనేది మంగళవారం రావటం వలన ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. గ్రహ స్థితులు అనుకూలంగా లేని వారు రేపు మహా శివుణ్ణి ఆరాదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పే 4 రాశుల వారికి ఈ జేష్ఠ అమావాస్య నుండి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఈ రాశులవారికి ఉన్న లక్షణాలు కారణంగా శివుని కృపతో ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. ఆ రాశుల వారు ఎవరో ? వారి గ్రహ స్థితుల కారణంగా ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు భగవంతుని నామస్మరణలో ఎక్కువగా గడుపుతారు. ఈ రాశివారికి భగవంతుని మీద ఎక్కువగా భక్తి ఉండుట వలన ప్రతి రోజు తప్పకుండ పూజ చేస్తారు. ఒకవేళ వీరికి పూజ చేయటం కుదరకపోయిన ఇంట్లో వేరే వారితో పూజ చేయిస్తారు. ఈ రాశివారు చెడు పనులు చేయటానికి అసలు ఒప్పుకోరు. ఈ రాశివారికి భగవంతుని మీద నమ్మకం చాలా ఎక్కువ. మనం మంచి చేస్తే భగవంతుడు మంచి చేస్తాడు అనే నమ్మకం ఎక్కువగా ఈ రాసివారిలో ఉంటుంది. దానికి అనుగుణంగానే వీరి అడుగులు ఉంటాయి. వీరి జీవితంలో జేష్ఠ అమావాస్య నుండి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయి. ఈ జేష్ఠ అమావాస్య రోజున ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ పరమశివుని కృప అపారంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశివారు హిందూ ఆచార వ్యవహారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వారిని కూడా పాటించమని చెప్పుతూ ఉంటారు. ఈ రాశివారి గ్రహ స్థితుల కారణంగా ఈ జేష్ఠ అమావాస్య నుండి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఈ రాశివారు మంచి పనులు చేయటానికి మాత్రమే ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అయితే కొంచెం బద్ధకం ఉంటుంది. అది వదిలించుకోవాలి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం,ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి. ఈ రాశివారు వచ్చన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికైనా సాయం చేయాలంటే ముందుంటారు. ఈ మంచితనం కారణంగా వీరికి మంచి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వీరు చేసే ప్రతి పనిలో భగవంతుని కృప ఉంటుంది. ఈ జేష్ఠ అమావాస్య రోజున ఆవుకి ఆహారం అందిస్తే జాతక దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
కన్యా రాశి
ఈ రాసివారి మనస్సు చాలా సున్నితమైనది. వీరు మనస్సులో ఏమి దాచుకోలేరు. మనస్సులో అనుకున్న ప్రతి విషయాన్నీ పైకి చెప్పేస్తారు. వీరిలో ఎక్కువగా క్రమశిక్షణ,క్షమ గుణం ఉంటాయి. ఒక్కోసారి ఇవే వీరికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంత పెద్ద సాయం అడిగిన కాదని అనకుండా చేస్తారు. ఈ రాశివారు ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే మాత్రం ఆ ఇబ్బందిని తొలగించేవరకు నిద్రపోరు. వీరిలో ఉన్న ఈ లక్షణం కారణంగానే జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరు ఎంత పై స్థితికి చేరిన ఒదిగి ఉంటారు. ఈ జేష్ఠ అమావాస్య నుండి ఈ రాశివారు ఎప్పటి నుంచో పడుతున్న కష్ఠాలు అన్ని తొలగిపోతాయి. జేష్ఠ అమావాస్య మంగళవారం రోజున శనీశ్వరుణ్ణి భక్తి శ్రద్దలతో పూజిస్తే గ్రహ దోషాలు ,నర దిష్ఠి వంటివి తొలగిపోతాయి. ఈ జేష్ఠ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశివారికి దైవం పట్ల చాలా భక్తి ఉంటుంది. కానీ బయటకు అసలు కనపడరు. ఈ రాశుల వారికి ఈ జేష్ఠ అమావాస్య నుండి గ్రహ సంచారం కారణంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరు వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. వీరికి సమయానికి చేతిలో డబ్బు ఎప్పుడు ఉంటుంది. వీరిలో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొనే సత్తా ఉంది. ఈ రాశివారు ఎదుటివారికి సహాయం చేయటానికి ఎప్పుడు ముందు ఉంటారు. సంపాదించిన ధనంలో కొంత సహాయం చేయటానికి ముందు ఉంటారు. వీరి అమాయకత్వం కారణంగా చాలా తొందరగా మోసపోతూ ఉంటారు. కుంభ రాశివారు ఈ జేష్ఠ అమావాస్య రోజు శనీశ్వరుణ్ణి ,ఆంజనేయ స్వామిని,శివుణ్ణి భక్తి శ్రద్దలతో పూజిస్తూ శివ అస్తోత్రాన్ని పఠిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.