Movies

స్టార్ హీరోలతో ఆడి పాడిన రంభ గుర్తు ఉందా… ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

రంభ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. కొత్తవారు రావటంతో సినీ అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో పద్మనాభన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఇప్పుడు మరల సినిమాల్లో నటించటానికి ప్రయత్నాలు చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి. మలేషియాకి చెందిన పద్మనాభాన్నివివాహం చేసుకున్న రంభకు ఇద్దరు పిల్లలు.

ఇద్దరు పిల్లలు పుట్టాక రంభకు తన భర్తతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో రంభ భర్తకు విడాకులు ఇచ్చేసి చెన్నయ్ లో స్థిరపడిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రంభ తన భర్తతో కలిసి కనిపించేసరికి అవన్నీ రూమర్స్ అని అందరు కొట్టిపారేసారు. అయితే ఇప్పుడు మరల రంభకు తన భర్తతో విబేధాలు వచ్చాయట. దాంతో రంభ పిల్లలను తీసుకోని పుట్టింటికి వచ్చేసిందట. పిల్లల భవిష్యత్ కోసం సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.

ఆ మధ్య రంగస్థలంలో రంభ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ రంగస్థలంలో నటించటం లేదు. ఆమెకు ఒక్క అవకాశం కూడా తలుపు తట్టటం లేదు. టీవీ షో లో జడ్జిగా వ్యవహరించింది. అది ఆ ఒక్క అవకాశంతోనే ఆగిపోయింది. ఆమెకు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.