Movies

Dj సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ హీరో

చిన్న వయస్సులో ఏమాత్రం భయపడకండా స్క్రీన్ మీద దర్శనమిచ్చే బాల నటులు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటారు. తమ నటనతో జన హృదయాల్లో ముద్ర వేసుకుంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి,పెద్దయ్యాక కూడా హీరో హీరోయిన్స్ గా, నటులుగా రాణిస్తూ ఇండస్ట్రీలో తమ సత్తా చాటిన,చాటుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు.

అయితే ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ బాహుబలి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి,మంచి గుర్తింపు కొట్టేసిన ఓ బాలనటుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతడెవరో కాదు సాత్విక్ వర్మ. నాగార్జున నటించిన కేడి సినిమాలో చిన్న బాబు పాత్రతో ఎంట్రీ ఇచ్చిన యితడు చందమామ కథలు,బాహుబలి,రేసుగుర్రం,ఓం బీరువా ,డీజే ఇలా 10ఏళ్లపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నాడు.

70కి పైనే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి, టీనేజ్ లోకి అడుగుపెట్టి, మళ్ళీ రావా,అదిగో మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన సాత్విక్ వర్మ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం కథలు వింటున్నాడు. ఛాన్స్ వస్తే హీరోగా కూడా రాణిస్తానని చెబుతున్నాడు. మరి విజయం సాధించాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."