Politics

ఇంటి కోసం కోట్లు ఖర్చుపెడుతున్న జగన్.. ఇక్కడ కూడా!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాస సెక్యురిటీ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది.ఇందులో భాగంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రక్షణ, నిర్వహణ, నూతన సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.1.94 కోట్లు కేటాయించింది.దీనిలో తాడేపల్లిగూడెంలోని సీఎం నివాస నిర్వహణకు రూ.1.20 కోట్లను కేటాయించగా, హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు కూడా నిధులు కేటాయించింది.

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సీసీ టీవీ, సెక్యురిటీ నిర్వహణకు రూ.35 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.39 లక్షలు కేటాయించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.రాష్ట్ర సీఎం సెక్యురిటీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులు తెలిపారు.కాగా దీంతో కలిపి ఇప్పటివరకు సీఎం జగన్ ఇంటి నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రూ.16.94 కోట్లు కేటాయించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఒక సీఎం తన ఇంటి కోసం ఇంతలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.సీఎంగా సెక్యురిటీ విషయంలో వృథా ఖర్చు చేస్తున్నాడని జగన్‌ను చెడుగుడు ఆడుతున్నారు ప్రతిపక్ష నేతలు.మరి వారికి అధికార నాయకులు ఎలాంటి కౌంటర్‌లు ఇస్తారో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."