Movies

బంగారం సినిమాలోని ఈ చిన్నారి గుర్తుందా ఇప్పుడు హీరో నాని తో నటించిన ఈమె ఎంతలా మారిపోయిందో

కొంచెం లావెక్కడమో,కొంచెం సన్నబడ్డమో ఇలా రకరకాల కారణాల వలన సినిమా సినిమాకు నటీనటులలో మార్పులు కనిపిస్తాయి. ప్లాస్టిక్ సర్జరీలు కూడా మార్పులకు కారణంగా ఉంటున్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి దాదాపు పుష్కరకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆంటీగా మారిపోయింది. ఆమె ఎవరబ్బా అనుకుంటున్నారా?

బంగారం సినిమాలో నటించిన సనూష తెలుసుగా. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మాయి బంగారంలో వింగారెడ్డిగా కన్పించింది. ఎన్నో మలయాళం మూవీస్,సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈమె 5ఏళ్ళ వయస్సులో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. చిన్న వయస్సులోనే సిల్వర్ స్క్రీన్ మీద,బుల్లితెరమీద కూడా బిజీ ఆర్టిస్ట్ అయింది.

పెద్దాయక మలయాళం మూవీస్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు కూడా సనూష తెచ్చుకుంది. అయితే బంగారం తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఈమధ్య నేచురల్ స్టార్ నానీ హీరోగా చేసిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ గా దర్శనమిచ్చింది. తెలుగులో కూడా హీరోయిన్ గా రావాల్సిన సనూష వయసుకి మించిన పాత్రలు పోషిస్తూ, తనలోనే టాలెంట్ ని నిరూపించుకుంటోంది.