కార్తీక దీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే అసలు నమ్మరు…!!!
సౌర్య అసలు పేరు గ్రంధి క్రితిక. ఆమె స్క్రీన్ నేమ్ బేబీ క్రితిక. ఈ చిన్నారి జీ తెలుగులో ప్రసారమైన గీతాంజలి సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఆ సీరియల్ తరువాత అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ వరుస సీరియల్స్ చేసింది. ఇలా 15కి పైగా సీరియల్స్‌లో నటించింది.
ఒక వైపు సీరియల్స్‌లో నటిస్తూనే చదువులోనూ చురుకుగానే ఉంటుంది క్రితిక. నెలలో మొదటి, చివరి వారాల్లో మాత్రమే షూటింగ్‌లో పాల్గొని మిగిలిన సమయాన్ని చదువుపై పెడుతోంది. ఉదయం ఎగ్జామ్ రాసి సాయంత్ర షూటింగ్‌లలో పాల్గొంటూ.. షూటింగ్ మధ్యలో దొరికిన సమయాన్ని చదువుకోసం ఉపపయోగించుకుంటోంది. అలా చదవినప్పటికీ 85 పర్శంటేజ్ కంటే తక్కువ వచ్చింది లేదంటోంది ఈ చిచ్చరపిడుగు. క్లాస్‌లో తనకు 5 లేదా 6 ర్యాంక్ వస్తుంది అంటోంది.
ఒకవైపు సీరియల్స్.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీ వరుస సీరియల్స్‌తోనే కాకుండా సినిమాలతోనూ బిజీ అయ్యింది క్రితిక. ఇటీవల ఇషారెబ్బా హీరోయిన్‌గా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రాగల 24 గంటలు’ చిత్రంలో నటించి మెప్పించింది.
అంతకు ముందుకు బాలకృష్ణ ‘సింహా’ చిత్రంలో బాలనటిగా మెప్పించింది క్రితిక. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ అరంగేట్రం మూవీ ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో పాటు భీమనేని శ్రీనివాసరావుతో కూడా పని చేసింది క్రితిక. ఇక బోయపాటి జయజానకి నాయక సినిమా అవకాశం మిస్ కావడంతో ఆయన తరువాతి చిత్రంలోనూ క్రితికకు అవకాశం ఇచ్చారు బోయపాటి. అతను అంతలా ఎంకరేజ్ చేస్తున్న బోయపాటితో కలిసి దిగిన ఫొటోనే తన ఫేస్ బుక్ ఖాతాకి ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది క్రితిక.
ఇక బోయపాటి జయజానకి నాయక సినిమా అవకాశం మిస్ కావడంతో ఆయన తరువాతి చిత్రంలోనూ క్రితికకు అవకాశం ఇచ్చారు బోయపాటి. అతను అంతలా ఎంకరేజ్ చేస్తున్న బోయపాటితో కలిసి దిగిన ఫొటోనే తన ఫేస్ బుక్ ఖాతాకి ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది క్రితిక.
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సౌర్య వెలుగులు వెరజిమ్మేందుకు రెడీ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించబోతుంది సౌర్య. ఈ రౌడీని విజయశాంతితో పోల్చుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్‌లు దర్శనం ఇస్తున్నాయి.
తన బర్త్ డే వేడుకను అనాథ శరణాలయంలో జరుపుకుని ప్రతి ఏటా.. వందలాది మంది విద్యార్దుల ఆకలి తీర్చుతోంది క్రితిక. అలాగే చిల్డర్స్ డే సందర్భంగా ఓల్డేజ్ హోంకి వాళ్లి వాళ్లకు స్వయంగా వడ్డించి తన పెద్ద మనసు చాటుకుంటూ శెభాష్ అనిపించుకుంటుంది బేబీ క్రితిక.
ఇప్పటికే 15 పైగా సీరియల్స్‌లో నటించిన క్రితిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక అవార్డుల్ని గెలుచుకుంది. మనసు మమత, బావా మరదల్లు, అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ, కార్తీకదీపం ఇలా చాలా సీరియల్స్‌కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుల్ని అందుకుంది.