Movies

టాప్ రెమ్యూనరేషన్ హీరో ఎవరు?

సినిమా ఫీల్డ్ లో టాలెంట్,ఛాన్స్ లను బట్టి హీరో హీరోయిన్స్ కి సంపాదన ఎక్కువే ఉంటుంది. బ్లాక్ బస్టర్స్ వస్తుంటే,ఆదాయం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. తేడా వచ్చినా ఆదాయం తగ్గిపోతుంది. బడ్జెట్ కూడా బాగా పెరగడం వలన రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువే ఉంటున్నాయి. తెలుగు సినిమా మార్కెట్ విలువ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఆదాయం ఆర్జిస్తున్న వాళ్లెవరో తెలుసుకుందాం. యంగ్ హీరోల్లో మహేష్ బాబు,ప్రభాస్,రామ్ చరణ్,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఒకరికొకరు పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వీళ్లకు దగ్గరలో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు.

రాజకుమారుడు మూవీతో హీరోగా ఏంట్రీ ఇచ్చి,ఒక్కడు,పోకిరి సినిమాలతో కమర్షియల్ హీరోగా మహేష్ బాబు ఎదిగాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడు గా వచ్చిన మహేష్ బాబు ఒక్కో సినిమాకు 20నుంచి 25కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి,బన్నీతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్న అల్లు వారి అబ్బాయి అర్జున్ ఒక్కొక్క సినిమాకు 14కోట్లు అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈశ్వర్ తో పునాదిపడిన ప్రభాస్ వర్షంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. బాహుబలితో తారాస్థాయికి చేరిన ప్రభాస్ ఒక్కొక్క మూవీకి 25కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చూడాలని ఉంది మూవీతో హీరోగా ఏంట్రీ ఇచ్చి,సింహాద్రి మూవీతో కమర్షియల్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 18కోట్ల వరకూ ఒక్కొక్క సినిమాకు తీసుకుంటున్నాడట. తొలిమూవీ చిరుతతోనే కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ మగధీర మూవీతో క్రేజ్ పెంచుకున్నాడు. ఒక్కొక్క సినిమాకు 17కోట్లు దాకా తీసుకుంటున్నట్లు టాక్.

అప్పట్లో చిరంజీవి,నాగార్జున,బాలయ్య,వెంకటేష్ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర తమకున్న ఇమేజ్ కాపాడుకుంటున్నారు. చిరు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బాలయ్య సినిమా బడ్జెట్ ని బట్టి రెమ్యునరేషన్ ఉండదట. వెంకీ 8కోట్లు,నాగ్ 7నుంచి 8కోట్లు అందుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఒక్కొక్క సినిమాకు 10కోట్లు ఉంటుందని టాక్.