Movies

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ‘బావ’ కూడా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

సినిమాల్లో వారసత్వమే కాదు బంధుత్వాలు ఉంటాయి. నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటనతో యంగ్ టైగర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే అతడి బావ కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించాడు. ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఒక్కసారిగా దూరం అయ్యాడు. ఎందుకంటే అతడి తండ్రి ఓ ప్రొడ్యూసర్. అందుకే తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చాడు.

ఇంతకీ అతనెవరని అనుకుంటున్నారా అతడే వడ్డే నవీన్. బాగున్నారా,మనసిచ్చి చూడు వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఆతర్వాత సపోర్టింగ్ కేరక్టర్స్ వేసిన నవీన్ ఆతర్వాత ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. అంతవరకూ బానే ఉంది గానీ తారక్ కి ఇతడికి రిలేషన్ ఏమిటని డౌట్ రావచ్చు. అయితే నవీన్ భార్య ఎవరో కాదు నందమూరి వారసురాలు. అవును ఎన్టీఆర్ పెద్దకొడుకు జయకృష్ణ కూతురుకి నవీన్ భర్త.

స్వయానా పెదనాన్న కూతురు భర్త కనుక తారక్ కి నవీన్ బావ అవుతాడు. జయకృష్ణ కూతురు తారక్ కి అక్క అవుతుంది. జయకృష్ణ కూతురుని ప్రేమించి పెళ్లాడిన నవీన్ ఆతర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. ఇద్దరూ విడివిడిగా వేరేవాళ్లను పెళ్లిచేసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఫామిలీ రిలేషన్స్ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."