Movies

ఫేమస్ రెస్టారెంట్ లకు టాలీవుడ్ స్టార్స్ ఓనర్ లని తెలుసా ?

సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ తో పాటు డైరెక్టర్స్,మ్యూజిక్ డైరెక్టర్స్ ,ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ ఇలా చాలామంది ఎవరి విభాగంలో వాళ్ళు రాణిస్తూ స్టార్స్ గా ఉన్నారు. వీళ్ళలో కొందరు వివిధ వ్యాపారాలలో కూడా ఉన్నారు. గోల్డ్,హోటల్ తదితర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. హీరోగానే కాకుండా ఎన్నో వ్యాపారాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న నాగార్జున వ్యాపార రంగంలో బాగా సంపాదిస్తున్నాడు.

సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో హీరోకి తమ్ముడిగా,ఫ్రెండ్ గా పాత్రలు వేసి,హీరోగా కూడా నటించిన నవదీప్ హీరోగా కన్నా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. బిపిఎమ్ పేరిట పబ్ కమ్ రెస్టారెంట్ పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు. అలాగే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ,ఆతర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరిట గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసి బిజీగా ఉన్నాడు. సినిమాల్లో నటిస్తూ హోటల్ వ్యాపారంలో కూడా బాగా సంపాదిస్తున్నాడు.

ఇక స్టార్ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్ హై లైఫ్స్ ది బెస్ట్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేసి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. బంజారా హిల్స్ లో పబ్ కం రెస్టారెంట్ ఓ ఊపు ఊపేస్తోంది. డైరెక్టర్ గా హిట్స్ అందుకున్న సురేంద్ర రెడ్డి ఉలవచారు రెస్టారెంట్ ప్రారంభించి మంచి డిమాండ్ ఉండేలా చేసుకున్నాడు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా సర్క్యూటింగ్ డ్రైవ్ పేరిట ఓ రెస్టారెంట్ పెట్టి బాగానే సంపాదిస్తున్నాడు.