Movies

ఫస్ట్ టైం ఫ్యామిలీ సీక్రెట్స్ చెప్పిన యంగ్ టైగర్

తెలుగు చలన చిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు ఫ్యామిలీ నుంచి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో తక్కువ సమయంలోనే ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కష్టపడి స్వయంకృషితో ఎదిగాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే 2011లో ప్రణతి ని పెళ్లాడాడు. తనకు పుట్టిన ఇద్దరు కొడుకులతో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే ఇటీవల ఓ టివికి ఇచ్చిన ఇంటర్యూలో తల్లి గురించి,అలాగే భార్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చిన్నప్పటినుంచి చాలా అల్లరిగా ఉండేవాడినని,ఈ అల్లరిని,ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేసేవారని అయితే ఫ్రెండ్స్ చిరాకు పడేవారని అన్నాడు. “నాకు అన్నీ అమ్మే. 17ఏళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో బిజీగా ఉన్న నాకు అన్నింటా అమ్మ స్ఫూర్తి. దగ్గరుండి గైడ్ చేసింది. అందుకే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను “అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

“ఇక మంచి నడవడిక గల అమ్మాయి నాకు భార్య గా రావడం సంతోషంగా ఉంది. మంచి చెడూ చెబుతూ నడిపిస్తోంది. కొడుకు అభయ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. చిన్నకొడుకు భార్గవ్ పుట్టడంతో లైఫ్ పూర్తిగా చేంజ్ అయింది. అందుకే షూటింగ్ లేనపుడు ప్రశాంతత కోసం ఇంటి దగ్గరే గడుపుతా”అని తారక్ వివరించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."